అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ చంద్రబాబుకు ఇష్టంలేదా?

సామాజికంగా వెనుకబడిన వర్గాలంటూ ఏడు దశాబ్ధాలుగా షెడ్యూల్డ్ తరగతులు షెడ్యూల్డ్ జాతులు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. తద్వారా అప్పటి నుండీ ఈ దేశ ప్రజలై ఉండి అగ్రవర్ణాలు అనే పేరుతో అందు లోని పేద వారు ప్రభుత్వం నుండి ఏలాంటి ప్రయోజనాలు పొందలేక, ఆదరణ దొరకక, నిర్వీర్యంగా జీవిస్తున్నారు. అయితే ఏ మూలన ఈ ఆలోచన ఉందో కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 శాతం వారికి రిజర్వేషన్లు ఇన్నాళ్లకి అనుగ్రహించింది.   

అయితే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించడం అంత ఇష్టం లేదనుకోవాలి. ఆయన ఆ మాట ప్రత్యక్షంగా అన లేదు కాని,మంచి కోసం రిజర్వేషన్లు అయితే స్వాగతిస్తామని, ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లకు గండి కొడతామంటే వ్యతిరేకిస్తామని ఆయన వ్యాఖ్యానించారని అనధికార సమాచారం ఒకటి మీడియాలో లీకైంది.  

ఈ సందర్భంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషణ్లు అనుగ్రహించి బిజేపి మైలేజీ పొందుతుందన్న అసూయతోనో, ఆగ్రహంతోనో, చంద్రబాబు లేకిగా  దేశంలో కుట్రలకు కేంద్రంగా సంఘ్-పరివార్ మారిందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కుట్రలను బీజేపీ అమలు చేస్తోందని కూడా ఆయన ఆరోపించారు. అయితే చంద్రబాబు సామాజిక వర్గం దేశంలొనే అత్యంత సంపదగలిగిన సామాజిక వర్గం కావటం వలన, చంద్రబాబుకు అగ్రవర్ణాలకు ప్రయోజనం కలగటం ఇష్టంలేదేమో? అంటున్నారు కొందరు రాజకీయ నాయకులు. 


అయినా ఈ 10 శాతం వారికి రిజర్వేషన్లు ఇవ్వటం వలన  ఎస్సి,ఎస్టి రిజర్వేషన్లకు గండి కొడుతున్నట్లు ఎలా అవుతుంది అలా అని ఆయనకు ఎవరు చెప్పారు? చంద్రబాబు ఆ రకమైన భావన ప్రజల్లో  రావాలని  కోరుకుంటున్నారా? లేక బిజెపి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ప్రజాభిమానంలో మైలేజ్ తీసుకుందని భయంతో భాదపడుతున్నారా? ఈ సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు, వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చడంపై డిమాండ్‌ చేయాలని నేతలకు ఆయన యిచ్చిన సలహా లో ఏదో కుతంత్రం ఉన్నట్లు ఉందనిపిస్తుందని అంటున్నారు చంద్రబాబు నైజం తెలిసిన జనం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: