మై గాడ్ ఆర్జీవి! రూట్ మార్చి 'లక్ష్మిస్ ఎన్టీఆర్' తో ఎక్కిళ్ళు తెప్పిస్తాడా!

టాలీవుడ్ లోనే కాదు! ఎక్కడైనా సరే రాం గోపాల్ వర్మ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోవడం వేరే ఎవరికి సాధ్యం కాదేమో? కంటెంట్ కొంతైనా స్క్రీన్ మీద దాన్ని ప్రెసెంట్ చేసే విధానం ఎలాఉన్నా ముందు ప్రచారంలో ఆయన లేవదీసే వివాదాలే ఆ సినిమాకు పెద్ద క్రౌడ్ పుల్లర్ కావటం అలా అయ్యేలా చేసే ఆయం టెంపో ఆయనకెర ప్రత్యేకం. జనంలో ఆసక్తిని రేపి, రెచ్చగొట్టైనా కొంత ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకుని పెట్టుబడిని సేఫ్ చేసుకోవడంలో రాం గోపాల్ వర్మ వ్యూహం ముందు ఎంతవారైనా తేలిపోవలసిందే. ఈ పొగడ్త మాత్రం అతని మార్కెటింగ్ కే కానీ సినిమాకు కాదు. ఇకపోతే మరి కొద్ది గంటల్లో నందమూరి ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బయోపిక్ "ఎన్టీఆర్ కథానాయకుడు" విడుదల అవుతున్న తరుణాన ఆర్జీవి టైం చూసి విసిరిన బాంబే మరో వీడియో సాంగ్.

ఇంతకు ముందు "వెన్నుపోటు పాట" తో పోలీస్ కేసుల దాకా కేసును నడిపించిన వర్మ ఈ సారి బ్రహ్మాండమైన మలుపు తిప్పి వెరైటీ థీమ్ సాంగ్ను ఎంచుకున్నాడు. లక్ష్మి పార్వతిని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ అసలు ఆవిడను ఎందుకు రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అని పాట మొత్తం ఒకే టోన్ లో ప్రశ్నా పరంపరలోకి తీసుకెళ్లి పోయాడు. శ్రీదేవి, జయప్రద,  జయసుధ ...ఇందరు అందగత్తెలు ఉండగా లక్ష్మిపార్వతిని, కుటుంబం వద్దంటున్నా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా, కోట్లాది అభిమానులు అభిమతానికి, రాజకీయబలం కాదని వారించినా, ఎందుకు? ఆవిడని పరిణయమాడాల్సి వచ్చింది? అంటూ పాట మొత్తం ప్రశ్నల వరదలో కొనసాగించారు. 

సిరాశ్రీ సాహిత్యం సమకూర్చగా కళ్యాణి మాలిక్ స్వీయస్వరకల్పనలో శ్రీకృష్ణతో కలిసి పాడాడు. ట్యూన్ పెద్దగా లేదు. ఏదో అలా చెప్పుకుంటూ పోయినట్టు ఉంది తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ హడావిడి తరుణంలోనే ఈ పాట ద్వారా వర్మ లక్ష్మిపార్వతిని పైకి లేపే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడనిపిస్తుంది. అసలు ఆ బయోపిక్ లో ఈవిడ పాత్రే లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా పక్కా-స్కెచ్ తో ఆర్జీవీ రావడం చూస్తే ఆహా! ఏమి పటుతర వ్యూహాలు కిక్కెక్కించక మానవు. బహుశ ఈ ప్రశ్నలకే సమాధానాలు రాబట్టితే సినిమా మహాభారతమే అవు తుందనటానికి ఎలాటి సందేహం అక్కర్లేదు. దటీజ్ వర్మ!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: