నేడు దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను ప్రారంభింస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ


అత్యంత ఉదృతమైన వేగంతో పరవళ్లు త్రొక్కుతూ ప్రవహించే బ్రహ్మపుత్ర - భారత్ లోని శక్తివంతమైన పురుషనది దాటాలంటే సాధారణ పరిస్థితుల్లో అసాధ్యం. ఆ పరిస్థితులను అధిగమించే నిమిత్తంగా 1997 లో ప్రారంభించినా 2002 లో నాటి ప్రధాని వాజపేయీ ప్రొద్భలంతో పనులు వేగం పుంజుకున్నా ఈ మద్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు క్రెడిట్స్ తమకు రావని భ్రమించి పనులను నిస్తేజం చేయగా - చివరకు 2014 లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శరవేగంగా వంతెన నిర్మాణపనులు పూర్తిచేసి -వాజపేయి జయంతి రోజైన నేడు నేటి ప్రధాని నరెంద్ర మోడీ జాతికి ఇంతగొప్ప నిర్మాణాన్ని అంకితం చేయబూనటం ముదావహం. 


సాధారణ ఎన్నికలకు సమయం శరవేగంగా దగ్గర పడుతున్న తరుణంలో ప్రతి నేత తన ప్రాంతానికి చేసిన మేళ్లేమిటో వివరించటం సహజం. అలాంటి వేళ 125 కోట్ల భారత జనావళికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మరో దఫా తన ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను తన నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని వివరిస్తూ, అప్పుడప్పుడూ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తు వస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటైన దేశంలోనే పొడవైన రైల్-రోడ్ వంతెన  ప్రారంభిస్తున్నారు అదీ ప్రియ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి అయిన ఈ రోజే. 

బొగ్బీల్ బ్రిడ్జ్ - దేశంలోనే పొడవైన రైల్-రోడ్ వంతెన ప్రత్యేకతలు: 

బొగిబీల్ బ్రిడ్జ్ అస్సాంలోని డిబ్రూగర్ నుండి ధీమజీ జిల్లాలను అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులను కలుపుతూ 170 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించటం దీని ప్రాధమిక లక్ష్యం. చైనా సరిహద్దులలోని సైనిక అవసరాలను తట్టుకునే సామర్ధ్యం దీనికుంది. యుద్ద టాంకులు, ఫైటర్-జెట్స్ లాండింగ్స్ ను కూడా భరించ గల శక్తి సామర్ధ్యం బలం ఈ వంతెనకు ఉండటం గుర్తుంచుకోవలసిన విషయం.

 

అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లను కలుపుతూ బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన 4.94 కిలోమీటర్ల పొడవైన రోడ్డు కమ్ రైలు వంతెనను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ వంతెన నిర్మాణం 1997లో ప్రారంభమైంది. అంటే దాదాపు 20 ఏళ్లకు పైగా దీన్ని నిర్మించారు. ఇంత ఎక్కువకాలం పట్టడానికి కారణం ఇంజినీరింగ్ సమస్యల కంటే రాజకీయ అంశాలే ఎక్కువని తెలుస్తోంది. దీని నిర్మాణంతో అసోం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు నాలుగు గంటలు, ఢిల్లీ నుంచి దిబ్రూగర్‌కి మూడు గంటలు ప్రయాణ సమయం తగ్గుతుంది. వంతెన నిర్మాణానికి అయిన ఖర్చు రూ.5,800 కోట్లు. ఇప్పటిదాకా కేరళలోని 4.62 కిలోమీటర్ల పొడవైన వెంబనాడ్‌ రైలు వంతెన దేశంలోనే పొడవైనదిగా గుర్తింపు కలిగివుండేది. ఇప్పుడు ఆ రికార్డును దిబ్రూగర్ వంతెన సాధించుకుంది.


బొగిబీల్ బ్రిడ్జ్  ప్రత్యేకతలు:


* ఈ భారీ వంతెన ఆసియాలోనే రెండో అతి పెద్దది. పూర్తిగా వెల్డింగ్ చేస్తూ నిర్మించిన బ్రిడ్జ్ కాబట్టి అతి తక్కువ నిర్వహణ వ్యయం మాత్రమే ఉంటుంది. దీనిలో స్విడన్-డెన్మార్క్ మరియు ఇతర యూరప్ దేశాల బ్రిడ్జ్ నిర్మాణ పద్దతులను, విధానాలను, ప్రమాణాలను దీని నిర్మాణంలో వినియోగించటం విశేషం.

* పొడవు 4.94 కిలోమీటర్లు. 170 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించటం దీని ప్రాధమిక లక్ష్యం
* బ్రహ్మపుత్ర నదిపై అసోం లోని దిబ్రూగర్‌ లో బొగిబీల్ బ్రిడ్జ్ నిర్మించారు. 

* రిక్టర్ స్కేలుపై 7.0 భూకంప తీవ్రతను కూడా ఈ వంతెన తట్టుకోగలదు.

* ఈ బ్రిడ్జి వల్ల అరుణాచల్‌ ప్రదేశ్‌ తో పాటు చైనా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయి.


1997లో నాటి తాత్కాలిక ప్రధాని దేవేగౌడ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. 2002లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభ మయ్యాయి. ఈ వంతెన పైభాగం లో మూడు లైన్ల రోడ్డు మార్గం, కింద రెండు రైల్వే ట్రాకులు ఉన్నాయి. దీన్ని బ్రహ్మపుత్రానదిపై 32 మీటర్ల ఎత్తులో నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కావటం వల్ల నిర్మాణ వ్యయం 5 రెట్లు పెరిగిందని తెలుస్తోంది.


వంతెన నిర్మాణం 2018 జూన్‌లో పూర్తయినా ప్రారంభోత్సవం అనేకసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టిన రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వంతెన ప్రారంభోత్సవం చేయటానికి ముహూర్తం సెట్టైంది. ఇదే సమయంలో బీజేపీ సాధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవడానికి, పార్టీకి మైలేజీ పెరగడానికి ఈ ప్రాజెక్టు కొంతవరకూ మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: