సైబరాబాద్ నిర్మాణ ఘనత పివి నరసింహారావుది మాత్రమే! చంద్రబాబుది మాత్రం కాదు!

నారా చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ "సైబరాబాద్ నిర్మాత" ను నేనే అంటూ ఉండటం - ప్రతి దాని క్రెడిట్ తానే తీసుకోవటం చూస్తూ ఉంటే భరించలేక  కొంత విషయ సేకరణ చేయటం జరిగింది. దీనికి ఆధారం ది లాంగ్ రివల్యూషన్: ది బర్త్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఐటి ఇండస్ట్రీ రచయిత దినేష్ సి శర్మ.

ఈ పుస్తకం మన మస్తిష్కానికి అందించే వరం — ఒక గొప్ప మార్పు లేదా పరివర్తనం కథ—  మనం సుగంధ ద్రవ్యాలను వ్యవసాయిక ఉత్పత్తులను ఖనిజాల నుండి లభించిన ముడి వజ్ర వైఢూర్యాలను ప్రత్యేక ప్రక్రియకు గురిచేసి తయారు చేసిన వస్తువులను, పారిశ్రామిక ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతులు దిగుమతులు చేస్తూ సంపదను పోగేస్తాం.

అలాగే మనలోని ఙ్జానతృష్ణతో సృష్టించిన ఙ్జానసేవకు రూపం సాఫ్ట్-వేర్ ఉత్పత్తులు వీటిని అమెరికా లాంటి అత్యధిక వినియోగ దేశాలకు ఎగుమతి చేసి సంపద పోగేస్తున్నాం. ఈ క్రొత్త శతాబ్ధపు అద్భుతం - ఐటి - అని మనం సరళంగా పిలుచుకొనే సమాచార సాంకేతిక విఙ్జానం (కంప్యూటర్ సైన్స్) ఇది ఒక వైఙ్జానిక విప్లవం ఇంకా చెప్పాలంటే అతివేగంగా అభివృద్ది చెందిన చెందుతున్న పరిణామం.  

అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తామే తెలంగాణాలో కంప్యూటర్ విఙ్జానాన్ని పరిచయం చేశామని, సైబరాబాద్ ను సృష్టిచేశామని చెప్పుకోవటం ఆ ఘనతను సొంతం చేసుకోవటానికి ప్రయత్నించే ఆలోచనను విరమించుకొంటే మంచిది. పరిశోధనల ద్వారా నిరూపించ గలిగే అర్ధదశాబ్ధంపైగా జరిగిన పరిణామక్రమంలో సరిగ్గా సేకరించిన సంగ్రహ పరిఙ్జానమే ఈ ది లాంగ్ రివల్యూషన్: ది బర్త్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఐటి ఇండస్ట్రీ గ్రంధం.


అంతే కాదు నాటి భారత రాజకీయ ఆర్ధిక పరిస్థితులను ఐటీ అభివృద్దికి తోడయ్యేలా సమతౌల్యం చేసి అభివృద్ధికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రొది చేసిన మహనీయులను గుర్తుచేసేలా రచించబడింది. ఎవరు బడితే వారు, నేడు భారత్ లోనో లేదా ఒక రాష్ట్రంలోనో ఈ ఐటి సృష్టికర్తను నేనే అనటం, వివిధ పేర్లతో పిలవబడే ఆధునిక ఐటి నగరాలను సృష్టించామనటం సృజించామనటం కొంచెం ఙ్జానం ఉన్న మనం సహించ లేము కదా! 

దీని వెనుక కొందరు నిస్వార్ధపరుల సేవాదక్షత, దేశభక్తి ఇమిడి ఉన్నాయి. అసలు హైదరాబాద్ లో సైబర్ టవర్స్ రూపంలో ఐటి పరిశ్రమ నిర్మాణం 1990 లోనే ప్రారంభమైంది. దీనికి ఊపిరులూది మార్గదర్శనం చేసినది భారత ప్రధాని పివి నరసింహారావు ఐతే ఆచరణలో పెట్టింది నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి మాత్రమే. కొందరు కాలక్రమంలో దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేసి తామే సైబరాబాద్ నిర్మాణం చేపట్టామని అంటున్నారు. . 


1995 తరవాత ఇక్కడ రియల్ నిర్మాణం పుంజుకొని సొంతం చేసుకోవటం మొదలెట్టారు. వారంతా ఇక్కడి ప్రజలు కాదు. భూ దాహంతో, ప్రభుత్వంలోని కొందరు సామాజిక వర్గాలవారు ప్రభుత్వ సహాయంతో  ఆక్రమించుకొని సేకరించిన భూములతో మొదలైన ఈ నగరం "ప్రత్యేక తెలంగాణా" కోసం రాష్ట్ర విభజనకు జరిగిన ఉద్యమానికి ఆజ్యం పోసింది  అలాంటి వారే నేడు తెలంగాణాలో రాజకీయంగా ఆర్ధికంగా ఊహాతీతంగా ఎదిగిపోయారు. నేడు సైబరాబాద్ నిర్మించింది మేమే అనే వాళ్ళకు ఆ అర్హతలేదు.


కాలంతో పాటు పదవుల్లో ఉన్నారు కనక అధికారం నిలబెట్టుకోవటానికి కార్యకారణాలను కొనసాగించక తప్పదు. అదే వాళ్ళు చేశారు. ఇందులో త్యాగం లేకపోగా అనుసరించిన విధానంతో వారు వారి సామాజిక వర్గాలలోని ఉన్నత స్థాయి వ్యక్తులు అమాంతం ఎదిగిపోయారు కాని ప్రజల మద్య నిట్టనిలువునా విభజన రేఖ గీయబడి రాష్ట్ర విభజన జరిగిపోయేలా ఉద్యమం చెలరేగింది. సరిగ్గా ఇప్పుడు అమరావతి లో జరిగేదీ అదే.  వాళ్ళు క్షమార్హులే కాదు. 

హైదరాబాద్‌ ను ప్రపంచపటంలో పెట్టాననీ, దానికి హైటెక్ సిటీయే పెద్ద నిదర్శనమని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పుకుంటారు. హైదరాబాద్ అభివృద్ధి అనే ప్రస్తావన రాగానే  "హైటెక్ సిటీ — సైబర్ టవర్స్" చిత్రాన్ని చూపిస్తూ, దాన్నే అభివృద్ధిగా చిత్రీకరించడం పరిపాటిగా మారింది. అసలు ఐటీకి తనే ఆద్యుడు అయితే   బెంగళూరు లోని సిలికాన్ సిటీని ఎస్ ఎం కృష్ణ అయివుండాలి మరి ఆయన నెప్పుడూ అలా చెప్పలేదు!  ముంబై శరద్ పవార్, చెన్నై జయలలిత ఇలా ఎప్పుడూ చెప్పుకోలేదు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొని వారు అధికారంలో కొనసాగారు ఐశ్వర్యంలో తులతూగారు. ఇందులో త్యాగం ఏమాత్రం లేదు. చెప్పుకోవాల్సిన పనిలేదు. తాజ్-మహల్ ను కట్టానని షాజహాన్ చెప్పుకోవచ్చు ఆయన సార్వభౌముడు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎవడి సొమ్మూ ఇందులో పెట్టలేదు ప్రజాధనం కర్పూరహారతి అవగా కొందరు అవకాశవాదులు అందలమెక్కారు.   



ఐటి చట్టం పునాదులకు ముందే జరిగిన ఈ అభివృద్ధి ఎవడబ్బసొమ్మూ కాదని మనవి. ఏవరూ దీన్ని ఓన్ - లేదా స్వంతం చేసుకోలేరు. సరళీకృత ఆర్ధిక విధానాల పుణ్యమా అని  దానికి అంకురంగా  పునాదిగా జరిగిన ఈ అభివృద్ధికి మూలం కేంద్రం. చొరవ తీసుకుంది.  ఈ మహత్కార్యకారకులెవని చెప్పాల్సివస్తే,  తెలంగాణా భూమి పుత్రుడు కీర్తిశేషులు మాజీ భారత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు మరియు దాన్ని సమయానికి అవకాశాన్ని అందిపుచ్చుకున్న విద్య-విఙ్జాన ప్రేమికులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి. ఈ మహత్కార్యం నేనే చేశానని చెప్పుకునే ఏపి ముఖ్యమంత్రి దీనిద్వారా రాజకీయ ఆర్ధిక సామాజికవర్గ ప్రయోజనాలన్నీ మూటగట్టుకోగా - పివి నేదురుమల్లి ఆశించిన ప్రయోజనాలు అందకుండా నిండా మునిగింది మాత్రం తెలంగాణా సామాన్య జనం. 
   


పితామహుడిననీ అంటారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనైతే కంప్యూటర్లు, మొబైల్స్ కూడా తన పుణ్యమేనంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం ఐటీ, సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు సంబంధించి హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానానికి చేరింది.

ఒక్కసారి హైదరాబాద్ ఐటీ ప్రస్థానం పరిశీలిస్తే తాతల నాడే ఇక్కడ ఐటీకి పునాదులు పడ్డాయనేది అర్థమవుతుంది. 90వ దశకానికి ముందే సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు తిరిగిన భూమి హైదరాబాద్. ఇప్పటికీ ఐటీ ఉద్యోగార్థులు నిత్యం కనిపించే మైత్రీవనం భవనమే ఇందుకు సాక్షి. మొట్టమొదటి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటయ్యింది అమీరు పేట మైత్రీవనంలోనె. ఇదే ఇంతింతై వటుదింతై అన్నట్లు విస్తరించి మాదాపూర్‌ గ్రామానికి చేరి సైబర్ టవర్స్ గా మారి ప్రస్తుత దృశ్యం రూపుదిద్దుకుంది.

హైదరాబాద్‌ లో కంప్యూటర్లు, ఐటీ అనగానే గుర్తొచ్చే “కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్-సీఎంసీ” సంస్థ 1982 లోనే “రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌” ను ఏర్పాటు చేసింది. అంతకు ఎంతో ముందుగానే ఎలక్ట్రానిక్స్ కార్పోరెషన్ ఆఫ్ ఇండియా-ఈసీఐఎల్ 1967 లోనే ఏఎస్ రావు గారి చొరవతో ఏర్పడింది. ఎలెక్ట్రానిక్స్ దెరివేటెడ్ ప్రొడక్టే కంప్యూటర్ సైన్స్ 

ఇంటర్‌గ్రాఫ్ అనే సంస్థ 1987ఆగస్టులోనే హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు ఆరంభించింది. చంద్రబాబు పదే పదే ప్రస్తావించే సత్యం రామలింగరాజు సైతం 1987 లోనే తన బంధువులతో కలిసి ‘పీఅండ్‌టీ కాలనీ’ ఖార్కానా సికిందరాబాద్ లో సత్యం కంప్యూటర్స్ ను ప్రారంభించారు. అది ఆపై అభివృద్ది చెంది 1992 లోనే పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. ఒక దశలో అది దేశం లోనే నాలుగో అతి పెద్ద ఐటీ ఎగుమతుల సంస్థ అయింది. 


అంతెందుకు, రక్షణ రంగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ “డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ రీసెర్చ్-డీఈఆర్‌ఎల్”ఇక్కడ 1961లోనే ఏర్పడింది. ఇవన్నీ జరుగు తున్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు, కనీసం మంత్రి కూడా కాదు!!

వాస్తవానికి ఇందిరా గాంది మరణానికి అంటే 1985 కి ముందే “భారత ఐటి చట్టం డ్రాఫ్ట్ రడీగా ఉంది. దాని రూపశిల్పి కూడా నాటి ఇందిరాగాంధి సలహా దారుడు పివి నరసింహారావు మాత్రమే. ఆమె మరణానంతరం రాజీవ్ గాంధికి కీర్తి ప్రతిష్టలు చేకూర్చటానికి ఐటీ రంగ విప్లవానికి బీజం వేసింది నాటి ప్రధాని పీవీ నర్సింహారావు. రాజీవ్‌గాంధీ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ రథసారథిగా పగ్గాలు చేపట్టిన పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణ ల సరళీకరణలతో దేశాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. అదే సమయంలో ఐటీ, సాఫ్ట్‌ వేర్ ప్రాధాన్యాన్ని కూడా గుర్తించారు. 

దేశంలో మెరుగైన అత్యంత నాణ్యమైన మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నందున ఈ  ఐటి సేవారంగమే భారత్లో ప్రమాదకర స్థాయిలో ఉన్న నిరుద్యోగ నిర్మూలనకు, దేశాభివృద్ధికి ఊతమిస్తుందని భావించారు. “సాఫ్ట్‌ వేర్ టెక్నాలజీ పార్కులు-ఎస్‌టీపీఐ - అనే భావనను పెంచి పొషించి బలంగా ప్రచారంలోకి తెచ్చింది పివి నరసింహా రావు మాత్రమె.  


మొదటిదశలో హైదరాబాద్ కు “ఆరు ఎస్‌టీపీఐ” లు మంజూరు చేశారు. కేంద్ర సమాచార పౌరసంభంధాల శాఖకు ఈ సాంకేతిక సమాచార శాఖ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అనుసంధించగా ఏర్పడ్ద కొత్త మంత్రిత్వశాఖ తొలుత అమీర్‌పేట లోని “మైత్రీవనం” భవనంలో ఒక “ఎస్‌టీపీఐ” ని ఆరంభించింది. దేశంలోనే ఇది మొదటిది. 

తరువాత ఎస్టిపీఇ మైత్రివనం ను మరింత విస్తృత పరిచి, ఎన్నెన్నో ప్రైవేటు సంస్థలకు స్థానం కల్పించటానికి ప్రత్యేక భవన నిర్మాణాన్నిసంకల్పించారు. ప్రధాని సూచన మేరకే విద్య సాంకేతిక అభివృద్ధి అంటే ప్రాణం పెట్టే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మాదాపూర్ గ్రామ ప్రాంతంలో 10ఎకరాల స్థలాన్ని కేటాయించటానికి తన మంత్రిమండలి అనుమతిని తీసుకున్నారు.  


1991లో ఎస్‌టీపీఐ ఆరంభమయ్యాక వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు నిరవధికంగా 100 శాతం అభివృద్దిలో పెరుగుదల నమోదైంది. ఇది జాతీయ సగటుకన్నా చాలా ఎక్కువ. 

కాలంతో పాటు ప్రయాణించేటప్పుడు ఆ సమయంలో వచ్చిన అవకాశాలను నాడు ఎస్ ఎం కృష్ణ బెంగళూరులో ఎలా వినియో గించుకున్నారొ - అదే విధంగా ఇక్కడ చంద్రబాబు కూడా వినియోగించుకున్నారు. మరి వైఎస్ రాజశెఖరరెడ్డి చేసిన అభివృద్ది గురించి చెప్పుకున్నా తక్కువేమీ గాదు. ఆ సమయానికి, అందివచ్చిన  అవకాశాలకు స్పందించకుండా ఉండి ఉంటే చంద్ర బాబు 9యేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్లు కాదు. "హీ జస్ట్ స్ట్రగుల్డ్ ఫర్ ఎక్జిస్టెన్స్ - దట్స్ వై హీ ఎక్జిస్టెడ్ - అండ్ మేడ్ హిజ్ వెల్త్"-సృజన గుఱించి, పాట్రియాటిక్ థాట్, దేశాభివృద్ధి  గురించిచెప్పాలంటే పివి నరసింహారావు గారిని గురించే మాట్లాడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: