ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్?

Purushottham Vinay
కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ చేతిలో మొత్తం రెండు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమా సీక్వెల్ తో పాటు ఎన్టీఆర్ 31 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ప్రశాంత్ నీల్.. ఏది ముందు మొదలు పెడతారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇటీవల సలార్-2 సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందని, మే చివరి వారం షూట్ స్టార్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేశారని కూడా తెలిసింది.ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని, 2024లో ఈ సినిమా విడుదల అవ్వనున్నట్లు కూడా సమాచారం వినిపించింది. మరోవైపు, ఎన్టీఆర్ - నీల్ సినిమాకు సంబంధించి గత ఏడాది ఒక పోస్టర్ రిలీజ్ అవ్వగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మరోసారి అనౌన్స్మెంట్ ఇచ్చి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం తెలుస్తుంది.


జులై మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించమని ntr 31 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ప్రశాంత్ నీల్ ను కోరుతున్నట్లు గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ .. వార్-2 షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంటారని సమాచారం తెలుస్తోంది. అందుకే మేకర్స్.. ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక హోంబలే ఫిల్మ్.. త్వరలో సలార్-2 సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయిందట. అలా షూటింగ్ కంటిన్యూ చేయాలని భావిస్తోందని సమాచారం తెలుస్తుంది.మొత్తానికి అటు హోంబలే ఫిల్స్.. ఇటు మైత్రీ మూవీ మేకర్స్.. ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాల అనౌన్స్మెంట్స్ ఇవ్వడానికి ఎంతగానో పోటీ పడుతున్నాయి. మే నెలలోనే ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధం అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్ పైకి వెళ్లనుందోనని అంతా కూడా మాట్లాడుకుంటున్నారు.మరి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: