తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ హీరో అభిమాని అని తెలుసా..?
అంతేకాకుండా తాను స్వతహాగా సినిమా అభిమానిని అంటూ గతంలో వనపర్తిలో లారీ ఎక్కి ఎన్నో సినిమాలు చూసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఏడాదికి 15 సినిమాలు విడుదల చేసేవారు. ఆయనకు నేను పెద్ద అభిమానిని, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒక్కో సినిమా తీయడానికి సుమారుగా ఐదేళ్లు పడుతోంది అంటూ ప్రస్తుత నిర్మాశైలి గురించి మాట్లాడారు. తెలుగు సినిమా మద్రాసు నుంచి హైదరాబాద్ కి తరలిరావడంలో ఏఎన్నార్, ఎన్టీఆర్ ,కృష్ణ ఇలా ఎంతోమంది కృషివల్లే సాధ్యమైందని తెలియజేశారు.
సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలలో చేసిన సాహసాలు సినీ పరిశ్రమను మలుపు తిప్పాయని నేడు భాష అడ్డంకులు కూడా తొలగిపోయాయని కేవలం టాలెంట్ ఉంటే ఎవరికైనా అవకాశాలు కలిగిస్తుందని తన అభిప్రాయంగా తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. బాహుబలి, అరుంధతి, కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన చేశాయని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు కోలీవుడ్ బాలీవుడ్ పోటీ కాదని మన లక్ష్యం హాలీవుడ్ కావాలంటూ పిలుపునిచ్చారు. విదేశీ చిత్రాలు సైతం హైదరాబాదులో చిత్రీకరణ జరిపించే స్థాయికి ఎదిగేలా ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కృష్ణానగర్ వంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది కళాకారులు, టెక్నికల్ నిపుణులు, సాంకేతిక నిపుణులు వస్తున్నారని వారిని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలియజేశారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మాట ఇచ్చారు.