భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన

మాల్దీవులపై పట్టు సాధించి హిందూ మహా సముద్రంపై పెత్తనం చేయటానికి ఆపై భారత్ ను కట్టడి చేయటానికి చైనా వేయని ఎత్తులేదు చేయని రాజకీయమూ లేదు. చైనా కు చంచాగిరి చేస్తూ మాల్దీవుల ప్రజలను ధారుణ దుర్గతిలోకి నెట్టటానికి మాల్దీవుల అధ్యక్షుడు "అబ్ధుల్లా యామీన్" చైనా ప్రయోజనాల కొసం తమ దేశంలొ "అత్యవసర పరిస్థి" (ఏమర్జెన్సీ) ని విధించిన సంగతి లోకం ఎరిగిన సత్యం కదా! 

మాల్దీవులను పూర్తిగా తన ఆధీనంలొకి తీసుకుని అక్కడ అత్యంత భారీ నోఉక యుద్ద విమానాల వ్యవస్తహలు నెలకొల్పటం ద్వారా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించి  భారత్ ను చక్రబంధంలో పీల్చి పిప్పి చేయటానికి సరిహద్దు రహదార్ల సంస్థ (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ - భృఓ) ను విస్థరించడానికి చైనా తొలి నుండీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీని కోసం మాల్దీవులులొని రాజకీయ నాయకులను సమాచార వ్యవస్థను (మీడియా) చైనా పెద్ద ఏత్తున కొనుగొలు చేసింది. అయితే ఈ విషయం గ్రహించిన భారత్ దానికి అంతర్జాతీయ సంస్థల ద్వారా అడ్డుపడటంతొ - మాల్దీవులు అధ్యక్షుడు "అబ్ధుల్లా యామీన్" చైనా ఆర్ధిక రాజకీయ సహకారంతో  మాల్దీవులలొ ఏమర్జెన్సీ విధించారు. 

అప్పటి నుండి భారత్ - అమెరికా తదితర దేశాల స్నేహ రాజకీయ వ్యూహాలతో అనేక రకాలుగా ప్రయత్నించి - మాల్దీవులపై అంతర్జాతీయంగా ఓత్తిడి పెంచి అత్యవసర పరిస్థితిని తొలగించటమే కాకుండా - మాల్దీవులలొ ప్రజాస్వామ్య పద్దతిలో ఏన్నికలు జరిపేలా చేశారు. ఈ ఏన్నికలలొ చైనా తొత్తు "అబ్ధుల్లా యామీన్" ను ఓడించడానికి - భారత్ పెద్ద ఏత్తున అంతర్జాతీయంగా ఆ దేశంలో ప్రచారం నిర్వహిన్వ్చేలా చేసి మాల్దీవులలో ప్రజాస్వామ్యవాదులైన అందరు రాజకీయ నాయకులను ఏకతాటి పైకి తీసుకురాగలిగింది. 

చైనా దుర్మార్గంతో - నిరంకుశ "అబ్ధుల్లా యామీన్" స్వార్ధంతో చెరసాల పాలైన సుప్రీం కొర్టు న్యాయమూర్తుల చేత మాల్దీవులు ప్రజాబాహుళ్యానికి అబ్ధుల్లా యామీన్ దౌష్ట్యాన్ని మనసులోతుల్లోకి చేరేలాగా చేయగలిగినంత చేశారు. దీనితొ ఏన్నికలలొ "అబ్ధుల్లా యామీన్" ధారుణ పరాభవం పొంది ఓడిపొగా - మాల్దీవులు అధ్యక్షునిగా భారతదేశ అను కూలుడైన "మహమ్మద్ ఇబ్రహీం సొలిహ్" ను మాల్దీవులు అధ్యక్షుని చేయడంలొ భారత్ చక్రం తిప్పింది. 

చివరకు నిన్న (ఆదివారం) జరిగిన తన ప్రమాణ స్వీకారొత్సవానికి 'మహమ్మద్ ఇబ్రహీం సొలిహ్' చైనా అధ్యక్షుని కాదని - భారత ప్రధాని నరేంద్ర మోదిని ఆహ్వానించారు  అంతేకాకుండా "మహమ్మద్ ఇబ్రహీం సొలిహ్ - అధ్యక్షుని" గా ప్రమాణం చేసిన నిన్నటిరొజే చైనా దుర్మార్గం వలననే తమ దేశం ఋFణాల ఊబిలొ కూరుకుపొయిందని చైనాపై విరుచు కు పడటం - అలాగే భారత్ మాత్రమే తమ నిజమైన మిత్రునిగా పేర్కొనడంతొ, భారత్ ఒకవైపు పొరుగుదేశం మాల్దీవులతో స్నేహం నిలుపుకోవటం మరో వైపు చైనాకు గుణపాఠం చెప్పి తనదే పైచేయిగా నిలబడగలిగింది. 

చైనా ఇనాళ్లనుంచి దుర్మార్గపు అలోచనతో చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా, వృధా ప్రయాసగా మిగిలిపొయింది. పనిలొ పనిగా మాల్దీవులతొ నరేంద్ర  మోది నేతృత్వంలో భారత్  "బలమైన ద్వైపాక్షిక ఓప్పందాలు" కుదుర్చుకుంటున్నారు. ఇంత వ్యూహతత్పరతతో భారత్  కీర్తి ప్రతిష్ఠలను విశ్వవ్యాపితం చేయటం రాహుల్  గాంధికి  సాధ్యమా? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: