బాబు శకుని తరహా రాజకీయాలని చీదరించు కుంటున్న కార్యకర్తలు

మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధి చేతులు పిసికేశాడు సైకిల్ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏ పార్టీ నియంతృత్వానికి వ్యతిరేఖంగా నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ప్రాతిపదికన తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో, అదే కాంగ్రెస్ తో నేడు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వాన్ని నిరోధించటానికి తెలుగుదేశం పార్టీని పొత్తుకు సిద్ధం చేశారు అవకాశవాద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.


సాంప్రదాయబద్ధంగా, కొన్ని సిద్ధాంతాల మూలాల పునాదులపై ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశాడో, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ 36 సంవత్సరాల రాజకీయం నడిపిందో అలాంటి కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం చేతులు కలపటం ఆ పార్టీకే తీరని అవమానం.


కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం తెలుగుదేశం వ్యతిరేక పార్టీ మాత్రమే కాదు. రాష్ట్ర విభజనతో స్వార్ధ పర రాజకీయాలను నెఱపటానికి సీమాంధ్రకు తీవ్రమైన అన్యాయం చేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీనే. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇప్పటి కడగండ్లకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ తో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు చేతులు  కలిపాడు. ఏపి ప్రజలు గత ఐదేళ్ళుగా పడుతున్న అవస్థలకు కారణమైన కాంగ్రెస్ తో పొత్తేమిటి అన్నవారికి "గతం గతః వర్తమానం, భవిష్యత్తు కోసం పనిచేస్తాం" అంటూ ఏవేవో పనికిమాలిన కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఉన్నాడు.


గతం గతః ఎవరికి? ప్రజలకూ గతమూ ముఖ్యమే, దానిపై నడిచే వర్తమానమూ అవసరమే, దీని ద్వారా రూపుదిద్దుకోబోయే భవిష్యత్ కూడా ముఖ్యమే. గతం లేని వర్తమానం పునాదులు లేని భవనమే. బాబు గతం మొత్తం పరపీడన పరాయణత్వమే. ఏపి ప్రజలు గతం మరచి వర్తమానం వర్తమానం వదలి భవిష్యత్ ను ఊహించుకోలేరు.


అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరుపై ప్రతిపక్షాలే కాదు, నిఖార్సైన టీడీపీ కార్యకర్త లతోపాటు రాష్ట్ర ప్రగతిపై ఆశలున్న ప్రతి పౌఉడూ కూడా నేడు టిడిపిపై మండిపడు తున్నారు. తెలుగుదేశం పార్టీ  ఆవిర్భావం నుంచి దానికి అండగా ఉంటున్నవారు కూడా ఇప్పుడు  చంద్ర బాబు తీరుతో విస్తుపోతున్నారు. ఇన్నేళ్లు వారికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ అంటే వారిలో తీవ్రమైన కక్ష, ద్వేషం, పగ, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక ఉంది. అది కూడా చంద్రబాబు పెంచి పోషించినదే. ఆశయమే. కాంగ్రెస్ అంటే నరనరానా వ్యతిరేకత అణూవణువున ప్రతీకారం వారిలో కోడెనాగులా బుసకొడుతూ ఉంది.


చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ సోనియా గాంధిని ఇటలీ దెయ్యమని, రాహుల్ గాంధిని ఙ్జానం లేసి మొద్దబ్బాయి అని, పప్పు అని, కాంగ్రెస్ పార్టీని దేశానికి పట్టిన శని అని, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను నేఱగాళ్ళ సమూహమని ఎలా తిడతూ వచ్చాడో, ప్రజలంతా కూడా అలాగే కాంగ్రెస్ ను అలాగే అసహ్యించుకొంటూ వచ్చారు.  అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నఫళంగా మడమ తిప్పటమే కాదు, నాలుక మడతేయటమే కాదు, అడ్డం తిరిగాడు. తమందరికీ ద్రోహం చేసి భవిష్యట్ లేకుండా చేసిన కాంగ్రెస్ తో చేతులు  కలిపాడు. కాంగ్రెస్ అధిష్టానం పాదాల చెంత మోకరిల్లాడు సాగిల పడ్డాడు. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ వీరాభిమానులు చంద్రబాబు అవకాశ వాదాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఆయన తీరు చూసి విస్తుపోతున్నారు. ఆయన్ని సమర్ధిస్తూ వార్తలు, వ్యాఖ్యానాలు ప్రసారం చెసే పచ్చ మీడియాను సైతం అసహ్యించుకుంటూ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: