2019 తర్వాత టిడిపి కనుమరుగైపోతుందా ?

Vijaya

అవుననే జోస్యం చెబుతున్నారు బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబునాయుడు పాలన వల్ల వచ్చే ఎన్నికల తర్వాత టిడిపి కనుమరుగైపోతుందని జివిఎల్ స్పష్టంగా చెప్పారు. రాజ్యసభ సభ్యుడి మాట చూస్తుంటే టిడిపికి రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలా అన్న అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబుకు  సిఎం రమేష్ బినామి అన్న విషయం తేలిపోయిందన్నారు. రమేష్ ఇళ్ళల్లోను, కార్యాలయాల్లోను ఐటి శాఖ జరిపిన దాడుల్లో రూ 100 కోట్లు దారిమళ్లినట్లు, పన్నులు ఎగొట్టినట్లు బయటపడిందన్నారు.

 

దొంగగా తేలిపోయింది కాబట్టి రమేష్ వెంటనే  పార్లమెంటు తరపున పబ్లిక్ అకౌంట్స్ కమిటిలో సభ్యునిగా కొనసాగించకూడదని డిమాండ్ చేశారు. వెంటనే పిఏసి మెంబర్ గానే కాకుండా రాజ్యసభ సభ్వత్వానికి కూడా చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయించకపోతే తామే పిఏసి సభ్యత్వం నుండి తొలగించాలని ఎథిక్స్ కమిటికి ఫిర్యాదు చేయించి ఆ పని చేస్తామన్నారు.

 

ఐటి దాడుల్లో దొరికిన వంద కోట్ల రూపాయల ఎగవేత, దారిమళ్ళింపుకు సంబంధించి రమేష్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రమేష్ ఇంట్లో దిరికిన వివరాల ఆధారంగా  ఐటి అధికారులు సిద్ధం  చేసిన నివేదికను జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై రమేష్ జవాబు చెప్పకుండా తప్పించుకోలేరంటూ ఎద్దేవా చేశారు. తాను సచ్చీలుడనంటూ తనతో డిబేట్ సందర్భంగా మీసాలు మెలేసిన రమేష్ ఐటి నివేదిక వెలుగు చూసిన నేపధ్యంలో మీసాలు తీయించుకుంటారా అంటూ నిలదీశారు. ఒక రాజ్యసభ్యునికి ఉండాల్సిన లక్షణాలేవీ రమేష్ కు లేవని జివిఎల్ నరసింహారావు తేల్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: