ఆ ఇద్దరూ కలుస్తారా...ఆయన డైరెక్షన్లో సినిమా చూపిస్తారా !!

Satya
రాజకీయాలు అంటేనే చిత్రాత్రిచిత్రం. మూడు గంటల మూవీలోనే ఎన్నో ట్విస్టులు ఉంటాయి. మరి పాలిట్రిక్స్ లో  కూడా ట్రిక్స్ లేకపోతే మజా ఏముంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఇపుడు జరుగుతోంది అదే. ఒకర్ని ఒకరు దెబ్బ కొట్టుకోవడానికి తెర ముందు వెనక చేసే విన్యాసాలు ప్రజలకు లేటుగా  తెలియవచ్చేమో కానీ అధినేతాశ్రీలకు  అలా గుట్టు దొరికేస్తోంది. దాంతో కొత్త ఎత్తులు వేస్తూ పావులు వేగంగా కదుపుతున్నారు.


బాబుకు బ్యాండేనా :


నా పుట్టలో వేలెడితే కుట్టనా అందట వెనకటికి ఓ చీమ. ఇపుడు కేసీయార్ అనే పుట్టను, తేనే తుట్టేను చంద్రబాబు కదిపారు. అంతే అక్కడ నుంచి రీ సౌండింగ్ మొదలైంది. అది ఎన్ని రూపాలు తీసుకుంటుందో, ఎలా ఫైనల్ టచ్ ఇస్తుందోనని బాబు అండ్ కో తెగ కంగారు పడుతోంది. టీయారెస్ కి వ్యతిరేకంగా మహా కూటమి కట్టడం వెనక బాబు ఉన్నాడన్నది నిర్వివాదాంశం. మరి తనపైనే దండయాత్ర చేస్తున్న బాబుని కట్టడి చేయాలనుకోవడం కేసీయార్ రాజకీయంలో భాగమే కదా. అందుకే ఏపీలో కూడా మహా కూటమికి రంగం సిధ్ధమవుతోందట.


ఆ ఇద్దరూ :


ఏపీలో ఇద్దరు యువ నాయకులు ఉన్నారు. జగన్, పవన్, బాబు కంటే సగం వయసులో ఉన్నా ఈ ఇద్ద్దరు దూకుడుగానే ఏపీలో పాలిట్రిక్స్ చేస్తున్నారు. పైగా ఏపీలో సగానికి సగం యూత్ ఓట్లు ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇద్దరు విడి విడిగా రాజకీయం చేస్తే లాభపడేది కచ్చితంగా చంద్రబాబేనన్నది తెలిసిందే. ఇపుడు అదే మాటను కేసీయార్ కూడ అంటూ తెర వెనక కలిపేందుకు రంగం సిధ్ధం చేస్తున్నారుట. ఈ ఇద్దరూ ఒక్కటైతే ఏపీ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. అంతేనా. టీడీపీకి బ్యాండ్ పడుతుంది. ఇపుడు ఆ పనిలోనే కేసీయార్ బిజీగా ఉన్నారట.


సాధ్యమేనా :


ఈ ప్రశ్నకు రాజకీయాల్లో అసలు చాన్సే లేదు. అవసరాలు బట్టి ఎవరు ఎవరితోనైనా కలవవచ్చు. పవన్, జగన్ విరోధులు ఏమీ కారు కూడా. మరి అలా కనుక చూసుకుంటే వచ్చే ఎన్నికలకు ముందే ఏపీలో మహా కూటమి కడితే చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తాయి. ఇదే విషయం టీడీపీ సమావేశంలో చంద్రబాబు మంత్రులతోనూ, కీలక నేతలతోనూ ప్రస్తావించారట.  జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడాల్సివస్తుందని కూడా హెచ్చరించారట. చూద్దాం, ఏపీ రాజకీయ సినిమా ఎన్ని మలుపులు తిరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: