మందిమీద ఎన్ని వ్యూహాలైనా పన్నొచ్చు! కాని మనల్ని ఎవరు టార్గెట్ చేసినా అది ఆపరేషణ్ గరుడేనా?


తెలంగాణాలో మహాకూటమి ఆలోచనకు ప్రాణం పోసింది ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి గెలుపుకు కళ్ళెం వేయటానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా వలపన్నినట్లే. అయితే నా పుట్తలో వేలు పెడితే నేను కుట్టనా! అనే తత్వం కెసిఆర్ ది. రాజకీయాల్లో నేనే నిప్పుని నా మాటే రైట్ అంటే అసలే కుడరదు. నువ్వు కొద్దిగా గెలికితే వేరే వాళ్లు గెలికి వాసన చూస్తారు. అంతే కాదు అందరికీ ఆ వాసన చూపితారు. అదే జరుగుతుంది ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విషయంలో. 


వైసిపి, జనసేన, బిజెపితో కొట్లాట పెట్తుకున్నారు. వాళ్ళను బూతులు తిడతారు వాళ్లపై అసెంబ్లీలో పంచాయతీలు పెడతారు. ఎందుకు అంటే నేను నిప్పును నా చేతికి వాచీలు ఉంగరాలు లేవు. నా భార్య సంపాదనతో నేను, నా కోడలు సంపాదనతో నా కొడుకు బ్రతుకు తున్నాం అంటారు. దేశంలోని ఏపి ముఖ్యమంత్రి అత్యంత అధిక సంపద కలిగినవారు. అయినా ఆయన నిరుపేదనని అంటారు. ఆయన రాజకీయాలు చేస్తారు కెసిఆర్ జగన్ పవన్ మోడీలు రాజకీయాలు చెయ్యొద్దంటారు. ఉదాహరణకు


ఈ కథ చూద్ధాం!    

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కలవకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేయి పెడుతున్నారా? నిజమే నని   ఆంధ్ర ప్రదేశ్ మంత్రి ఒకరంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రితో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాల పై, మావోయిస్టుల కదలికలపై చంద్రబాబు ఈరోజు(బుధవారం)పార్టీ ముఖ్యనేతలతో, మంత్రులతో చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు రాజకీయంగా కలిసి పని చేద్దామని కేసిఆర్ కు సంకేతాలు ఇచ్చానని, ప్రధాని నరెంద్ర మోడీ మాయలో పడి ఆయన అందుకు అంగీకరించలేదని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. టిడిపి కి  దెబ్బతీయడానికి కేసిఆర్ నరేంద్ర మోడీతో కలిసి పనిచేస్తున్నారనే అభిప్రాయన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో మహాకూటమి కట్టడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని ఒక సీనియర్ మంత్రి అన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపికి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలపడానికి కేసిఆర్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం తెలంగాణలో జరుగుతోందని ఆయన అన్నారు.  అన్ని రకాల కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలను ఎదుర్కోవాలని చంద్రబాబు తన మందీ మార్బలానికి సూచించారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని, అయితే వ్యక్తిగత విమర్శ లకు వెళ్లకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు. (కెసిఆర్ అంటే చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి -ఓటుకు నోటు కేసులో గతంలో కెసిఆర్ చుక్కలు చూపించాడు కదా!)   

జాతీయ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలనే విషయంపై స్పష్టత ఉండాలని, బిజెపి వ్యతిరేకపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించాలని మంత్రు లు అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. తనపై గతంలో దాడి చేసివారే అరకులో ప్రస్తుత మరియు మాజీ టిడిపి శాసనసభ్యుల జంట హత్యలకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారట (దీన్ని గతంలో వైసిపి వాళ్ళే ఈ హత్యల వెనకున్నారని టిడిపి నాయకుడొకరు ఎలా వ్యాఖ్యానించారు? మరిప్పుడు బాబేమో ఇలా మాట్లాడుతున్నారు)    


తెలంగాణలో ఐటి దాడులు కేంద్రం ప్రమేయంతోనే జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉందని మంత్రులు అన్నారు ముఖ్యమంత్రిని, మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఆ దాడులు జరిగే అవకాశం ఉందని వారన్నారట. 


అయినా బాబు నిప్పు, బృందం నీతిమంతులు - భయం అంటూ లేకుండా ఉండొచ్చు గదా! ఇదంతా ఎందుకు? మరి. మనం నీతిమంతులం కాదు నిప్పూ కాదనే అర్ధం! అయినా మంత్రివర్గ సమావేశమెప్పుడైనా ప్రజాప్రయోజనాల కోసం జరిగిందా? అంతా వారి లోపాలు వారికి తెలిసు కాబట్టి బిజెపి దాడులు తప్పవని గ్రహించి తమకు ప్రజల రక్షణ కోసం మాయోపాయంతో చేస్తున్నదే ఈ తతంగం అంటున్నారు జనం.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: