రామోజీ రావు అందుకే జగన్ కు మద్దతు ఇవ్వలేదా...!

Prathap Kaluva

ఆంధ్ర ప్రదేశ్ లో ఈనాడు దిన పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాక్షి లేనప్పుడు గుత్తాధిపత్యం దీనికే ఉన్నది అయితే ఈ పేపర్ చంద్ర బాబు కు అనుకూలమన్న సంగతీ తెలిసిందే. కానీ రామోజీ రావు మద్దతు కోసం జగన్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి మరీ అడిగిగాడు మరీ అతను జగన్ కు మద్దతు ఇచ్చాడో లేదో మనకందరికీ తెలిసిందే. జగన్ సతీమణి గురించి పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించింది ఈనాడే. 


రామోజీరావు ప్రస్థానాన్ని పరిశీలించేవారు ఎవరికైనా రెండు విషయాలు క్లియర్ గా తెలుస్తాయి. ఒకటి ఆయనకు ఆయన వ్యాపార సామ్రజ్యం, ముఖ్యంగా ఈనాడు ప్రాణప్రదమైనవి. వాటి జోలికి ఎవరు వచ్చినా ఆయన సహించరు. వదిలిపెట్టరు. ఈనాడు తరువాతనే ఆయనకు తన సామాజికవర్గం లేదా తెలుగుదేశం. అంతేకానీ ముందుకాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడంలో కానీ, దానికి తన సర్వశక్తులు ఒడ్డడంలో కానీ రామోజీ సహకరించారు అంటే కారణం ఆయనకు సామాజికవర్గ అభిమానం. దానికి అధికారం సాధించిపెట్టడం అనడంలో సందేహంలేదు.


మరి ఈనాడుకు ఇప్పటికీ ఇంతో అంతో పోటీగా వున్న సాక్షి యాజమాన్యాన్ని ఎలా మిత్రులు అనుకుంటారు? ఎలా సహిస్తారు? ఎలా క్షమిస్తారు. జగన్ అధికారం సాధిస్తే, సాక్షి స్థాయి ఎలా వుంటుందో రామోజీ ఊహించలేరా? అలా కోరి ఈనాడు పీకలమీదకు పోటీని తెచ్చుకుంటారా? సాక్షి ప్రారంభించినపుడు ఈనాడు ఎన్ని వ్యయప్రయాసలకు లోనయిందో తెలియదా?చంద్రబాబను ఓ రాష్ట్రస్థాయి భారీ దినపత్రికను ప్రారంభించే ప్రయత్నం చేయమనండి. అప్పుడు తెలుస్తుంది రామోజీరావు అంటే ఏమిటో? లేదా ప్రియపచ్చళ్లు ఉత్పత్తులకు పోటీగా భారీగా హెరిటేజ్ ఉత్పత్తులను రంగంలోకి దింపమనండి అప్పుడు తెలుస్తుంది ఆయన ఆగ్రహం ఎలా వుంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: