పెళ్ళి చేసుకోనంత మాత్రాన రాహుల్ గాంధి ఏమైనా బ్రహ్మచారా? పవన్ కళ్యాణ్

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కో లేక ఈ విపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి తన మంది మార్భలంతో శాసనసభ నుంచి పారిపోయాడని అన్నారు. దమ్ము, ధైర్యం, శక్తి ఆయనకు లేవని అన్నారు. భీమవరం లో శుక్రవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన సభాసదులను ఉద్దేశించి ప్రసంగించారు.

జగన్మోహనరెడ్డి స్థానంలో తానే గనక ఉంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక ఊపు ఊపేసేవాడినని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకున్న హక్కులను వదిలేసి బాధ్యత లను మరచి ప్రజాస్వామ్యవ్యవస్థను సరిగ్గా వినియోగించుకోవడం మానేసి ప్రజలను గాలికివదిలేసి ఇలా సంకల్పయాత్రలు చేస్తే ఎలాంటి ఉపయోగంలేదని ఆరోపించారు. 

కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావు తనపెళ్లిళ్లపై మాట్లాడుతూ రాహుల్ గాంధి పెళ్లి గురించి ప్రస్తావించారని, పెళ్లి చేసుకోనంత మాత్రాన ఆయన బ్రహ్మచారా? అని అన్నారు. తన జీవితం పై విమర్శలు చేసే ఇలాంటి వారికన్నా అన్నీకోణాల్లో తను వారందరికంటే బెటర్ అని అన్నారు. 

"పవిత్ర గురు పౌర్ణమి రోజు చెబుతున్నా! పశ్చిమ గోదావరి జిల్లా నుంచే రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటాం" అని జనసేన అధినేత అన్నారు. జనసేన సిద్ధాంతాల గురించి , పవన్ కల్యాణ్ గురించి ఆలోచించాలని, ప్రజా సమస్యలపై ఏ ప్రభుత్వం నిలబడుతుందో ఆ పార్టీకే ఓటెయ్యాలని అన్నారు.  "మీరు నాపై బురద చల్లండి. దాడులు చేయండి. ఏమైనా చేయండి. నా దగ్గర జన సైనికులు ఉన్నారు. కత్తులు పట్టుకునే వీర మహిళలు ఉన్నారు"  అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు విప్లవాన్ని గుండెల్లో పెట్టుకున్న వాడినని, ఫ్యాక్షనిస్టులకు భయపడనని హెచ్చరించారు.
 
పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు తమను మన్నించాలని బహిరంగసభ ముగింపులో ఆయన కోరారు. తమ వల్ల ఏమైనా ఇబ్బందులు జరిగితే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: