గ్రేటర్‌ నోయిడాలో విషాదం.. కుప్పకూలిన భవనాలు..!

Edari Rama Krishna
గ్రేటర్‌ నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. షా బెరీ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రెండు భవనాలు కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భవనాల శిథిలాల కింది సుమారు 50 మంది వరకూ చిక్కుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి సమయంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల మరో భవనంపై పడిపోయింది.

అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగిపోగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు ప్రారంభించాయి. నాలుగు అంతస్తుల భవనంలో 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీంతో శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 3 మృతదేహాలను బయటకు తీయగా.. గాయపడిన 50మందిని ఆస్పత్రికి తరలించారు. 

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.అయితే శిథిలాల కింద 30 మంది వరకూ ఉండవచ్చని, దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  భవనాల ప్రమాద వివరాలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: