“పవన్” కి...“ఐవైఆర్ వెన్నుపోటు”

Bhavannarayana Nch

నమ్మి ఆసరా ఇచ్చిన వారి వెనుక గోతులు తీయడం వెన్నుపోటు పొడవడం ఐవైఆర్ కి కొత్తేమీ కాదు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గా తిరుమల తిరుపతి ఈవో గా..రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా ఎన్నో పదవులని అలంకరించిన ఐవైఆర్..ఆ పదవులు రావడానికి ప్రధాన కారణం అయిన చంద్రబాబు కి ఎలా వెన్నుపోటు పొడిచారో ఎలాంటి విమర్శలు చేశారో  ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..ఆయితే ఐవైఆర్ పై చర్యల అనంతరం ఆయన వైసీపి తో కలిసి చంద్రబాబు ని ఇబ్బంది పెట్టారని తెలుగుదేశం నేతలు ఎంతో మంది విమర్శలు కూడా చేశారు..

 

ఈ క్రమంలో పవన్ నేతృత్వంలో సాగిన జెఎఫ్ఎఫ్ సి లో కూడా ఆయన కీలకంగా ఉన్నారు పవన్ కి ఫుల్ సపోర్ట్ చేశారు..ఒకానొక దశలో జనసేన నుంచీ ఐవైఆర్ కి టిక్కెట్టు కూడా ఖారారు అయ్యింది అనే వార్తలు కూడా వినిపించాయి అయితే చాలా కాలం తరువాత మళ్ళీ ఐవైఆర్ మీడియా ముందు మాట్లాడారు..పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై ఆమధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జెఎఫ్ఎఫ్ సి కమిటి ఇచ్చిన నివేదిక తప్పుల తడక అని ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు.

 

వాళ్ళు తయారు చేసిన నివేదిక  కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకొని తయారు చేశారని అయితే కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తీసుకోలేదని ఐవైఆర్ ఆరోపించారు...నవ్యాంధ్ర మేధావుల ఫోరం ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐవైఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యి ఈ వ్యాఖ్యలు చేశారు..లోటు బడ్జెట్ పై రాష్ట్ర నివేదిక చెల్లుబాటు కాదని తేల్చేశారు..అటు ప్రభుత్వంపై కూడా తన అసహనాన్ని తెలిపారు.

 

 విభజన విషయంలో చంద్రబాబు కోర్టుల వరకూ వెళ్ళడం సరైన నిర్ణయం కాదని దీనిని రాజకీయంగా పరిష్కరించుకోవాల్సిన విషయం అని కోర్టులకు వెళ్లడం ద్వారా మరింత సంక్లిష్టం చేసుకోవడమేనని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.అయితే నిన్నా మొన్నటివరకూ కూడా పవన్ కళ్యాణ్ తో రాసుకుపూసుకు తిరిగిన ఐవైఆర్ ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో పవన్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి అయితే ఈ నివేదిక ఇచ్చే ఎంతో కాలం గడిచింది  అయితే ఇప్పుడు ఎందుకు ఐవైఆర్ ఈ విషయాలు లేవనేత్తుతున్నారు అనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు జనసేన నాయకులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: