ప్రశాంత్ కిశోర్ "కీలక సర్వే"....ఆందోళనలో జగన్..

Bhavannarayana Nch

జగన్ మోహన్ రెడ్డి  పాదయాత్రకి స్పందన పెరిగిపోయింది..చంద్రబాబు నాయుడుకి ఈ సారి సీఎం సీటు రావడం కష్టం..విభజన హామీలపై మరియు విభజన చట్టం పరిధిలోని అంశాలపై ముందుగా మనమే పోరాడి చూపించాము మనల్ని చంద్రబాబు ఫాలో అయ్యారు తప్ప చంద్రబాబు చేసింది ఏమిలేదు అంటూ జగన్ తమ నేతలలో ధైర్యాన్ని నూరి పోస్తూ వచ్చే ఎన్నికలకి గ్రౌండ్ వర్క్ చేస్తూ సర్వం సిద్దం చేసుకుంటున్నారు..మరో పక్క మా ఎంపీలు ముందుగా రాజీనామా చేశారు అని అంటూ మాకు మాత్రమే చిత్తశుద్ది ఉంది అంటూ వాల్యూ లేని రాజీనామాలు చేయించారు..ఆసమయంలో వైసీపి కి మాంచి మైలేజ్ కూడా వచ్చింది జగన్ ఇమేజ్ ఈఫిల్ టవర్ అంత ఎత్తుకు వేలిపోయింది..అయితే తాజాగా ఎంపీల రాజీనామాలు స్పీకర్ సుమిత్రామహాజన్ ఆమోదం తెలిపారు..అయితే ఇక్కడే జగన్ మోహన్ రెడ్డి కి బెంగ పట్టుకుంది..గుండెల్లో తెలియని ఆందోళన నెలకొంది..అదేంటంటే..


 ఏమ్పీలో రాజీనామాలు చేసిన తరువాత ఆ రోజంతా ఢిల్లీతోపాటు ఏపీలోనూ హడావుడి  చేస్తూ హోదా కోసం  ర్యాలీలు, ఆందోళనలు వైసీపీ ఎంపీలకు మద్దతుగా ప్రజలు కూడా నిలబడటం ఇవన్నీ వైసీపి కి నూతన ఉశ్చాహాన్ని ఇచ్చాయి..పార్టీ మైలేజ్ పెంచాయి అయితే  ఇదే హడావిడి స్పీకర్ ఎంపీల రాజీనమాలని ఆమోదించిన రోజున లేకపోవడం గమనార్హం..అయితే అప్పటికి ఇప్పటికీ ప్రజలలో ఏమి మార్పు వచ్చింది..? ఎందుకు ఇంతగా స్పందన లేకుండా పోయింది..?  అనే విషయం పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది...అయితే ఈ పరిణామాలతో ఆందోళన చెందిన  జగన్ మోహన్ రెడ్డి ప్రశాంతి కిశోర్ ని హుటాహుటిన రమ్మని పిలిచిన జగన్ ఓ కీలక సర్వే చేయమని చెప్పారట..

 

ఇంతకీ ఆ సర్వే సారంశం ఏమిటంటే..రాజీనామాలని స్పీకర్ ఆమోదించిన విషయంలో ప్రజలలో స్పందన ఎలా ఉంది అని అయితే ఆ సర్వేలో వచ్చిన రిజల్స్ చూసిన జగన్ రెడ్డి కి మైండ్ బ్లాకి అయ్యిందట..ఇంతకీ ఏమితెలిందంటే ఏపీ ప్రజలలో కనీసం  10 శాతం మంది ప్రజలు కూడా ఈ విషయంపై చర్చించుకోలేదట..అయితే దీనికి కారణాలు కూడా చెప్పాడట కిశోర్..ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఎప్పుడు చంద్రబాబు నే టార్గెట్ చేస్తున్నాడు తప్ప కేంద్రాన్ని ఒక్క మాటకూడా అనడం లేదు..అసలు హోదా ఇచ్చేది బాబు నా లేక కేంద్రమా అనే భావన వ్యక్తం చేశారట..దాంతో జగన్ చంద్రబాబును టార్గెట్ చేసి...ఆ గోతిలో తానే పడిపోయాడని అర్థం అవుతోంది.

 

అయితే జగన్ ప్రజా సంకల్పయాత్రతో సంపాదించిన సానుభూతినంతా మోడీ పంచన చేరి పోగుట్టుకున్నారన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని ఈ సర్వేలో తేలిందట...అయితే ఇదే సమయంలో టిడీపి బీజేపి చేసిన నమ్మక ద్రోహాన్ని బీజేపి చాటున ఉండి దోబూచులు ఆడుతున్న వైసీపి చేష్టలని ఎండగట్టడానికి సిద్దం అవుతోందట.. అంతేగాకుండా ఉప ఎన్నికలు రావన్న తర్వాతనే వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారని ముందునుంచే టీడీపీ వర్గాలు అంటూనే ఉన్నాయి ఇప్పుడు అదే జరిగింది. రెండు నెలల తర్వాత వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడంతో ప్రజల్లో స్పందన కరువైంది. ..దాంతో ప్రజలు మాత్రమే కాదు వైసీపి పార్టీ నేతలు కూడా జగన్ తీరు పట్ల అసహనం వ్యక్తమ చేస్తున్నారని తెలుస్తోంది..ఏది ఏమైనా జగన్ వేసిన తప్పటడుగు టీడీపీ కి కలిసొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: