అస్సలు సర్వేలు బాబుకు ఏం చెప్పాయి... అందుకే ఆందోళన...!

Prathap Kaluva

 చంద్ర బాబు కు ఈ మధ్య అసహనం ఎక్కువైంది అందుకే మా సమస్యలను పరిష్కరించమని నాయీ బ్రాహ్మణులు తన దగ్గరకీ వస్తే అందరు విస్తు పోయే విధముగా మాట్లాడి విమర్శుల పాలయ్యాడు. అయితే జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రజల్లో కి బలంగా వెళ్లిందన్నది అక్షర సత్యం. దీనితో వైసీపీ కి మైలేజ్ పెరుగుతుంది పైగా జగన్ ప్రత్యేక హోదా విషయం లో తీసుకున్న స్టాండ్ ప్రజల్లో విశ్వాసం కలిగించింది.అక్కడే చంద్ర బాబు విఫలమయ్యాడు. 


రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రపై చర్చ జరుగుతున్న మాట వాస్తవం. నేషనల్‌ మీడియా, వీలు చిక్కినప్పుడల్లా ప్రజా సంకల్ప యాత్రను ప్రత్యేకంగా కవర్‌ చేస్తూ వస్తోంది. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతుందని అభిప్రాయపడ్తున్నారు. 


ప్రజా సంకల్ప యాత్రకు ముందు.. ప్రజా సంకల్ప యాత్ర తర్వాత.. వివిధ జిల్లాల్లో జరుగుతున్న ప్రైవేట్‌ సర్వేలు, వైఎస్సార్సీపీ బలం అంచనాలకు మించి పెరిగిందనే తేల్చుతున్నాయి.  నిజానికి, జగన్‌ పాదయాత్ర ఎఫెక్ట్‌ ఏంటో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. వాస్తవాలు ఆయనకి తెలియక కాదు, ఆయన ఒప్పుకోలేరంతే. 2019 ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడంపై చంద్రబాబులో ఎంత ఆందోళన వుందో, ఇటీవలి కాలంలో ఆయనలో పెరిగిపోతున్న అసహనం చెప్పకనే చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: