లోకేష్ ప్రతిభ ఎక్కడున్నా దాగేటట్లు లేదే...!

Prathap Kaluva

లోకేష్ చంద్ర బాబు నాయుడు తనయుడు తెలుగు ప్రజలు అతన్ని ముద్దుగా పప్పు అని పిలుచుకుంటారు. అయితే లోకేష్ కు ఆ బిరుదు రావడానికి కారణాలు అందరికీ తెలియసిందే. తానూ మాట్లాడే స్పీచులు కామెడీ సినిమా ను తలపిస్తాయి కనుక ప్రతి పక్ష పార్టీ తిట్ట బోయి తమ పార్టీనే తిడుతాడు. అవతలి పార్టీ కి ఓటు వెయ్యొద్దని చెప్పబోయి టీడీపీ కే ఓటు వెయ్యొద్దని చెప్పే అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తి కనుక అందుకే తెలుగు ప్రజలు అతన్ని ముద్దుగా పప్పు అని పిలుస్తారు. 


అయితే ఇప్పుడు లోకేష్ కేవలం ట్విటర్లో మాత్రమే స్పందిస్తున్నాడు. డైరెక్టుగా మాట్లాడితే ప్రతిభ బయటపడుతుంది, ట్విటర్ అయితే.. ఎవరు రాశారో తెలీదు, ఎవరు పోస్టు చేశారో తెలీదు. కాబట్టి.. లోకేష్ ఇలా ట్విటర్ చాటుకు వెళ్లాడు. నాలుగేళ్లకు కానీ లోకేష్‌కు తత్వం బోధపడినట్టుగా లేదు. ఎలాగూ భజంత్రీ మీడియా ఉండనే ఉంది. లోకేష్ ట్వీట్లు అదిరిపోతున్నాయని విశ్లేషించగలదు. డైరెక్టుగా అదరగొట్టలేని లోకేష్‌ ఈ విధంగా ముందుకు పోతున్నాడు.


ఇప్పుడు ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించామని లోకేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఇది కేవలం అడ్డగోలువాదనే. ఎందుకంటే ఎమ్మెల్యే ఫండ్స్‌ను టీడీపీ ఇన్‌చార్జిల చేతుల్లో పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమే. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటల్లా ఆ నియోజకవర్గంలోని టీడీపీ ఇన్‌చార్జిల పేర్లు మీద ఆ ఫండ్స్‌ను రిలీజ్ చేశారు. కావాలంటే గెజిట్స్ చూసుకోవచ్చు. జీవోలను పరిశీలించుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటే, అధికార పార్టీ ఇన్‌చార్జిలకు నియోజకవర్గం నిధులు ఎలా ఇస్తున్నారు? అని అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ వాళ్లు మొత్తుకున్నారు. చరిత్రలో ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరూ లేరని విరుచుకుపడ్డారు. అయితే చంద్రబాబు వాటిని లెక్క చేయలేదు. ఆ తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జిల పేరు మీదే నిధులు వదిలారు. నిర్భయంగా అదే పని చేశారు. అయితే ఇప్పుడు లోకేష్ మాత్రం అడ్డగోలు వాదన మొదలుపెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: