గల్లా జయదేవ్ మహెష్ బాబు బావ టిడిపికి, చంద్రబాబుకు ఝలక్ ఇచ్చెలా ఉన్నారట?

గల్లా జయదేవ్,  తెలుగుదేశం ఎంపి సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యులు తెలుగు దేశం పార్టీ కి ఝలక్ ఇవ్వనున్నట్లు అమరావతిలో ప్రచారం సాగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంట్ కు గుంటూరు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గల్లా జయదేవ్. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీలో చేరిన జయదేవ్, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని రాష్ట్రమంతా రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు  తెలుస్తుంది - సర్వేల పేరుతో  అదే పెద్దఎత్తున ప్రచారం సాగుతున్న సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నా రని అభిజ్ఞవర్గాల సమాచారం.  

 

అంతేకాదు వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వైసిపి అధికారంలోకి వస్తుందని ప్రచారం సాగడంతో తెలుగు దేశం పార్టీని వదలి అదే పార్టీలో చేర నున్నాడు అని గుసగుసలు మొదలయ్యాయి.

 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా రాకపోవటాని నాలుగేళ్ళ టిడిపి-బిజెపి మైత్రి కూడా కారణమని ప్రజలు టిడిపి పై ఆగ్రహంగా ఉన్నారని అందుకు తెలుగు ప్రజలు టిడిపిపై సానుకూలంగా లేరని నమ్ముతున్నాడు గల్లా జయదేవ్. అంతేకాదు గతంలో ప్రత్యేకహోదా సంజీవని కాదని శాసనసభలో చేసిన వ్యాఖ్యల మూలంగా ఇప్పుడు చంద్రబాబు యు-టర్న్ తీసుకొని ప్రత్యేక హోదా వైసిపి నుంచి హైజాక్ చేయటానికి ప్రయత్నించినా ప్రజలు నమ్మరని జయదేవ్ భావిస్తున్నారట.

అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉండగా రాష్ట్రాభివృద్దికి నిధులు వచ్చే సమస్యే లేదని దానికితోడు బిజెపి నాయకులు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో జయదేవ్ ఊగిసలాటలో పడ్డాడట. ఇక రంద్రం పడ్డ ఈ నావలో ప్రయాణం చేయటం మంచిదిగాదని భావిస్తున్నారట.

 

అలాగే తన మామనాటి సూపర్ స్టార్ ఆంధ్రుల ఆరాధ్యనటుడు కృష్ణ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకే అంకితమై సేవలు చేస్తున్నాడు. అంతేగాదు ఆయన జగన్ తండ్రి గారైన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రాణ మిత్రుడు కూడా. వైసిపి అధినేత జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వార్తలు వస్తున్న దృష్ట్యా విజన్ ఉన్న జయ దేవ్ తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇచ్చి వైసిపిలోకి వెళ్లడం ఖాయమని ప్రచారం సాగుతోంది. అయితే ఇంతకుముందు ఇలాంటి కథనాలేవస్తే, జయదేవ్ స్పందించాడు టిడిపి వీడటం లేదనిచెప్పాడు, మరి ఇప్పుడు ఈ విషయాలపై స్పందిస్తాడా? లేదా? అని ప్రజలు అనుకుంటుంటే, టిడిపి మాత్రం స్పందన ఎలా ఉంటుందోనని వణికి పోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: