బిజెపికి ఇది ధారుణ పరాభవం

104 శాసనసభా స్థానాలు గెలుచుకొని "సింగిల్ లార్జెస్ట్ పార్టీ"  గా ఉన్న బిజెపి అక్రమ పద్దతుల ద్వారా తాను తన మెజారిటీ నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల ను కుంది కర్ణాటకలో అదీ నాటకీయంగా.  గత రెండు, మూడు రోజులుగా తీవ్ర ఉత్కంఠత రేపిన కర్ణాటక రాష్ట్ర రాజకీయం అనూహ్య మలుపు తీసుకుంది.  శాసనసభలో విశ్వాసపరీక్షకు ముందే మూడురోజుల ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీ లో ప్రసంగిస్తూ, ఈ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించి రాజకీయవర్గాలను ఆశ్చరయంలో కాంగ్రెస్ జెడిఎస్ ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.

సభలో తమకు లేని బలం నిరూపించు కోవడానికి చివరిక్షణం వరకు ప్రయత్నించి, అది వైఫల్యం చెందటంలో విశ్వాస పరీక్ష ముందే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. దీంతో విశ్వాస పరీక్ష లేకుండానే విజయం సాధించడంతో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే బిజెపికి 104 స్థానాలను కట్టిపెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తాను రైతాంగానికి ఎంతో సేవచేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పీఠం అదిష్టించాలనుకున్నట్లు, గత ప్రభుత్వ తప్పిదాలను ఏకరువు పెడుతూ ఉద్వేగ ప్రసంగం చేశారు. 

యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్‌లో ఉత్సాహం పెరిగింది, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయాక, ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ సభలోనే నినాదాలుచేశారు. ఒకరికి ఒకరు అభినందనలు తెలుపు కున్నారు.  జేడీఎస్ నేత కుమార స్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్‌ దగ్గరకు వెళ్లి చేతులు కలిపారు. విక్టరీ సింబల్ చూయిస్తూ ఉత్సాహంగా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు, నేతలు కూడా సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయాల దగ్గర సందడి వాతావరణం కనిపించింది. స్వీట్లు తినిపించు కుంటూ టపాసులు పేలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే డప్పులతో డ్యాన్సులు చేస్తూ ఫుల్-జోష్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రమే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నేతలు సంబరాలు మిన్నంటాయి. 


కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం వెనక కీలకమైన పాత్ర సుప్రీంకోర్టు తీర్పేనని చెప్పవచ్చు. బలనిరూపణకు యడ్యూరప్పకు 15రోజులు గడువు ఇవ్వగా, ఆ గడువును పూర్తిగా తగ్గించడం ద్వారా సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషించింది. సుప్రీంకోర్టుదే కీలకమైన పాత్ర అని కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా అన్నారు. అంతేకాకుండా, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచే కాంగ్రెసు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 


అతి పెద్ద పార్టీగా బిజెపి అవతరించిన మరుక్షణం జెడిఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేస్తూ వేసిన కాన్గ్రెసు తొలి అడుగు వ్యూహన్ని సరైన మలుపు తిప్పిన్ ది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవీ ప్రమాణం చేసిన తర్వాత కూడా కాంగ్రెసు వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. శాసనసభ్యులను బెంగళూరు నుంచి హైదరాబాదు తరలించడం, తిరిగి బెంగళూరుకు తరలించడంలో కాంగ్రెసు నేతలు చాలా పకడ్బందీగా వ్యవహరించారు. బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడాని కి చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది.

గాలి జనార్దన్ రెడ్డి ఆడియో టేపులను విడుదల చేయడం, బలనిరూపణకు ముందు యడ్యూరప్ప ఆడియో టేపులను విడుదల చేయడం వంటి చర్యలు కాంగ్రెసు, జెడిఎస్ లకు కలిసి వచ్చాయి. తమ చేతి నుంచి జారిపోతారని భావించిన ఎమ్మెల్యేలను నైతికంగా తమవైపే తిప్పుకోవడంలో కూడా కాంగ్రెసు నేతలు చాలా పకడ్బందీ వ్యవహారం నడిపారు. కాంగ్రెసు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ ల కృషి ఈ విషయంలో అభినందనీయం. వారు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇదే సమయం లో జెడిఎస్ సభ్యులు జారిపోకుండా కూడా చాలా వరకు కాంగ్రెసు నేతలే చర్యలు తీసుకున్నారు.  

"జెడిఎస్ తో కాంగ్రెస్ మైత్రి" సలహా ఇచ్చింది మాత్రం ప్రియాంక 

మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణను బిజెపి తన వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడం చాలా వరకు కలిసి వచ్చింది.  రేవణ్ణ పదవి కోసం ఆరాటపడకుండా కుమారస్వామిని బలపరుస్తూ ప్రకటన చేయడమే కాకుండా, జారిపోతారని భావించిన ఎమ్మెల్యేలను కూడగట్టడంలో కూడా కీలక పాత్ర పోషించారు.


కాకపోతే కర్ణాటక ప్రజలకు సంభందం లేని, ప్రజలు కోరని జెడిఎస్ కుమారస్వామి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్దతిలో పార్టీ స్వామ్యంతో ప్రభుత్వం ఏర్పడ బోతుంది. ఏమైతేనేం ప్రజాస్వామ్యం ప్రస్తుతానికి నిలబడ్దట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: