షాకింగ్ కర్ణాటక ఎన్నికల ఫలితాల పై వేలకోట్లలో బెట్టింగులు !

Seetha Sailaja
దేశరాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ వచ్చే ఏడాది జరిగే  సార్వత్రిక ఎన్నికల పైన ప్రభావాన్ని చూపించే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రేపు జరగబోతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ - బీజేపీ – జేడీఎస్ పార్టీల భవిష్యత్ కు మాత్రమే కాకుండా మోడీ రాహుల్ గాంధీల  వ్యక్తిగత ప్రతిష్ఠకు ఒక పరీక్షగా మారిన ఈఎన్నికల ఫలితాల కోసం రాజకీయపార్టీ నేతలు మాత్రమే కాకుండా దేశప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దక్షిణాదిన జరుగుతున్న ఈఎన్నికల రణరంగంలో పాల్గొంటున్న బీజేపీ  కాంగ్రెస్ జేడీఎస్ పార్టీల అభ్యర్ధులు ఈఎన్నికలలో అనధికారికంగా ఖర్చు 25వేల కోట్లు ఈఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టారు అని ఒకప్రముఖ జాతీయ ఛానల్ ఒక షాకింగ్ న్యూస్ ను ప్రచారం చేసింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి మాత్రమే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల నుంచి కరెన్సీ కట్టలు వరదలా అన్ని ప్రధానపార్టీ అభ్యర్ధులు ప్రవహింప చేసారని వార్తలు వస్తున్నాయి.

కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు ఉంటే అందులో 25 శాతం వరకు వివిధ పార్టీల అభ్యర్ధులు ఇలా ఎన్నికలలో ధనాన్ని వరదనీటిలా ప్రవహింపచేసారు అని జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అంతేకాదు ఇటీవల దేశంలో జరిగిన ఏ ఎన్నికలలోను ఇంత భారీ స్థాయిలో ఖర్చు జరగలేదు అన్నవార్తలు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తులు తమ విజయం గురించి మాత్రమే కాకుండా ఎదుటి పార్టీలోని కీలక నేతలకు ఈఎన్నికలలో తటస్థంగా ఉండమని కోట్లలో డబ్బు ఇస్తున్నారు అన్నవార్తలు కన్నడ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా నువ్వానేనా అనే స్థాయిలో జరుగుతున్న ఈ ఎన్నికలలో గెలుపు ఏపార్టీకి వస్తుంది అన్న విషయమై సుమారు 3 వేలకోట్ల వరకు బెట్టింగ్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే ఆశ్చర్యకరంగా కర్ణాటక ఎలక్షన్స్ తో ఎటువంటి సంబంధం లేని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలలో కర్ణాటకలోని 65 లక్షల తెలుగువారు ఏపార్టీకి ఎర్త్ పెడతారు అన్న విషయాల పై కూడ కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అన్ని రాజకీయ పార్టీలలోనూ పెను మార్పులు ఉంటాయి అని కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో ఒక మినీ సెమీ ఫైనల్ లా జరుగుతున్న ఈ కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం అందరూ చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: