మీడియా ఎంతగా మద్దతిచ్చినా జనవిశ్వాసం కోల్పోతున్న చంద్రబాబు

మొత్తం మీద చంద్రబాబును టిడిపిని తెలుగు ప్రధాన మీడియా ఎంతపైకి లేపినప్పటికి సోషల్ మీడియా చురుకుగా వ్యవ హరిస్తుండటం అనేక ప్రశ్నలు సందిస్తూ ఉండి సమాధానాలు లేదా అంతరంగాలను స్పృజిస్తూ కొనసాగటం చంద్రబాబుకు ధారుణ శరాఘాతమే.


టిడిపికి మద్దతిచ్చే మీడియా రాసే రాతలను జనం నిర్ధారణ చేసుకోవటం అంటే మేలుకోవటం మొదలైందన్నట్లే. అప్పటి నుండే పచ్చ మీడియా మద్దతిస్తూ రాసే రాతల వలన టిడిపికి లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది. 


రాష్ట్రంలోపల మేకపోతు గాంభీర్య పరిస్థితి:


రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయన తనయుడు మంత్రివర్గ సహచరులపై అవినీతిపై కేంద్రం ప్రభుత్వం తన నిఘా నేత్రం గురిపెట్టిందన్నది విషయం తెలుసుకునే, ప్రజలే తనకు రక్షణ కవచంగా ఉండాలని సీఎం అంటున్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మీ ప్రభుత్వ పెద్దల అవినీతికి, అక్రమాలకు రక్షణగా ఉండాలా? ఇదేం చోధ్యం? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. బుధవారం గుంటూరు జిల్లా వినుకొండలో వైసిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదాపై ముఖ్యమంత్రి సీఎం పిల్లిమొగ్గలు వేస్తున్నారని, ఇంకా ఎన్నిసార్లు "యూటర్న్‌" తీసుకుంటా రని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర ను చూస్తే ప్రజలు ఎవరి పాలన కోరుకుంటున్నారో? తెలుసుకోవటానికి సర్వేలు పరిశోధనలు విశ్లేషణలు అవసరం లేకుండానే అర్థ మవుతుందన్నారు. తెలుగుదేశం రాక్షసపాలనకు చరమగీతం పలకటానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా పార్టీ కార్య క్రమాల్లో పాల్గొని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఎనాడో తన హుందాతనాన్ని శాసనసభ ప్రతిష్ఠను మంటగలపడంతో, ఆ పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని అన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేటల్లో డబ్బులు ముట్టజెప్పినవారికే పనులు చేస్తూ, ప్రశ్నించిన వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రం వెలుపల డిల్లీలోపల గులాం సలాం పరిస్థితి:

రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతానంటూ ఒక వైపు వీరావేశంతో ప్రకటనలు చేస్తున్న సీఎం మరోవైపు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కుంభకోణాలకు చెందిన కేసుల నుంచి తప్పించుకోవడానికి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం దినదిన ప్రవర్ధమానం అవుతుండ టానికి, రాజకీయంగా తన ప్రతిష్ఠ గ్రాఫ్‌ సరసరా పడిపోతుండడంతో చంద్రబాబు గుండెల్లో గుబులు లావాలా పెల్లుబుకుతుండటం మొదలైనట్లు తెలుస్తోంది. 

ఆరిపోయే దీపం అధిక వెలుగులు చిమ్మినట్లు, రాజకీయంగా ఉనికి చాటుకోవడం కోసమే తనలోని పూర్తి శక్తిని కేంద్రీకరించుకొంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని ధారుణంగా విమర్శిస్తూ,  "ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగామే తప్ప నరేంద్ర మోదీ నాయకత్వంపై తమకు  వ్యతిరేకతలేదని" పలుమార్గాల ద్వారా కేంద్రానికి, బీజేపీ అధినాయ కత్వానికి చంద్రబాబు 'రాష్ట్రప్రజలకు తెలియకుండా సంజాయిషీలు' ఇచ్చుకుంటున్నారనే అభిప్రాయం దేశమంతా వ్యక్తమవుతోంది. అంతేకాదు చంద్రబాబు శకుని రాజకీయాలను జాతీయ మీడియా పసిగట్టటంతో తన ఉపన్యాస వేదికలను రాష్ట్రానికే పరిమితం చేసుకున్నారని లోకం కోడై కూస్తుంది. టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి వారం రోజులక్రితం హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమై చంద్రబాబు తరఫున వివరణఇచ్చుకున్నట్లు, నష్టనివారణ చర్యలకు ఉపక్ర మించినట్లు సమాచారం.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర నిఘావిభాగానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యాలయాన్ని ఆ విభాగం అధినేత రాజీవ్‌ జైన్‌ ఆరు రోజుల క్రితం తొలిసారిగా సందర్శించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఆయన ఆరా తీశారు. ఇది గమనించిన చంద్రబాబు అజెండాలో లేకున్నా చర్చలకోసం రాజీవ్‌ జైన్‌ ను తన కార్యాలయా నికి ఆహ్వానించారట. రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకుందా అని ఆయనను అడిగినట్లు సమాచారం. 


దీనిపై ఇంటెలిజెన్స్ అధిపతి రాజీవ్‌ జైన్‌ స్పందిస్తూ, పోలవరం, రాజధాని అక్రమాలపై పూర్తి సమాచారం కేంద్రప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉందని స్పష్టం చేసినట్లు తెలిసింది. తాను పలు సంస్థలతో చేయించుకున్న సర్వేల వివరాలను రాజీవ్‌ జైన్‌ ముందుంచి రాజకీయంగా తన వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ పరువు గ్రాఫ్‌ క్రమంగా పడిపోతుండడం, అదే సమయంలో ప్రతిపక్ష వైసిపికి ప్రజాదరణ అమాంతం పెరుగుతుండడం వల్లే విధిలేని పరిస్థితుల్లో రాజకీయంగా ఉనికి చాటుకోవడం కోసమే కేంద్రప్రభుత్వం నుంచి వైదొలిగామని సిఎం ఆయనకు వివరించినట్లు తెలిసింది. 

నిజానికి కేంద్రం, బీజేపీ అధినాయకత్వంపై, ప్రత్యేకించి ప్రధాని నరెంద్రమోదీపై తనకు ఎలాంటి వ్యతిరేకతలేదని సీఎం విన్నవించుకున్నట్లు సమాచారం. రెడ్‌ క్రాస్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం విశాఖ వెళ్లిన గవర్నర్‌ నరసింహన్‌ అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు చేరుకోవాలి. కానీ, రాత్రికి విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర నిఘా విభాగం అధికారులతో సమావేశమైన గవర్నర్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సంబందిత వివరాలపై ఆరా తీశారు. 

అనంతరం ముఖ్యమంత్రిని పిలిపించుకుని మాట్లాడారు. "సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిరసన దీక్ష ఎలా చేస్తారని" చంద్రబాబును గవర్నర్‌ గట్టిగానే నిగ్గదీసినట్లు తెలుస్తుంది. అంతేకాదు మీ పార్టీ హిందూపురం నియోజకవర్గ శాసన స భ్యుడు, మీ వియ్యంకుడు, ప్రఖ్యాత సినీ నటుడు బాలకృష్ణ ప్రధానిని అవహేళన చేస్తూ ప్రసంగిస్తూ ఉంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, రాజకీయ ఉనికి కోసమే కేంద్రంపై పోరాటం చేస్తున్నాను తప్ప తనకు బీజేపీపై కోపం లేదని బతిమాలుకున్నట్లు సమాచారం. 

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రత్యేక ప్రతిపత్తి హోదా ప్రయోజనాలను వివరిస్తూ ప్రతిపక్షనేత  జగన్‌మోహనరెడ్డి కొనసాగిస్తున్న 'ప్రజాసంకల్పయాత్ర'కు జనం నుంచి స్వతంత్రంగా వస్తున్న విశేషస్పందన చూస్తున్న చంద్రబాబును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేక హోదా కోసం తాను కూడా కేంద్రప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు ప్రజలను నమ్మించడానికి వేసే ఎత్తులో భాగమే ఒక రోజు చంద్రబాబు నిరసన దీక్ష అని దానికి ఇరవై కోట్ల ప్రజాధనం వృధా చేసారని రాష్ట్రం అంతటా ప్రజలల్లో వెల్లువెత్తుతున్న అభిప్రాయం.  

తన పుట్టిన రోజున విజయవాడలో "ధర్మపోరాట దీక్ష" అంటూ చెపట్టిన దీక్షలో కేంద్రప్రభుత్వంపై, బిజెపిపై, ఆ పార్టి నాయకుడు అమిత్ షాపై, చివరకు దేశ ప్రధాని నరెంద్ర మోడీపై పలు రకాలుగా పలు దఫాలుగా ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానిని అతి హీనాతిహీనంగా తూలనాడడం నాటి మహాభారతంలోని "రాజసూయ యాగ ఘట్టంలో శిశుపాలుని దుష్ట పన్నాగంతో కూడిన ప్రసంగం" లాగా కనిపిస్తూ వినిపించిందని తీవ్ర విమర్శలకు దారితీసింది. 

ఈ నేపథ్యంలో కేంద్రం, బీజేపీ నాయకత్వం తనపై ఆగ్రహంతో ఉందని, ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చని పసిగట్టిన చంద్ర బాబు వెంటనే నష్టనివారణ చర్యలకు దిగారు. బీజేపీ నాయకత్వాన్ని మంచి చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర బీజేపీ మంత్రి సుధీర్‌ ముంగత్వార్‌ భార్య సప్నను టీటీడీ పాలకమండలిలో సభ్యురాలిగా నియమించడం, సుజానా చౌదరి ద్వారా సంధి రాయభారాలు లోపూచీన పెద్దయెత్తున కొనసాగుతున్నట్లు అభిఙ్జవర్గాల భోగట్టా. అంతే కాదు కేంద్రం తనను ఏమైనా చేయవచ్చని ప్రజలు తనకు రక్షణ వలయంగా ఏర్పడాలని కోరటం మాత్రం ఆయనలోని దినదినం దిగజారుతున్న మనో దౌర్భల్యాన్ని నైతిక పతన స్థాయిని తెలుపకనే తెలుపుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: