కులం దాచిపెట్టి టిటిడి పదవిలో చేరిన టిడిపి ఎమెల్యే అనిత

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వివాదాస్పదం కావడం దురదృష్టకరమని అన్నారు. ఈ మద్య రాజకీయ పునరావాసాలకు టిటిడి ఆలవాలమైపోతోంది. హిందువుల మనోభావాలు ధారుణంగా దెబ్బతీసే విధంగా టిడిపి అధినేత, ఆంధ్ర ప్రదేశ్  ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. టీటిడి పాలక మండలి నియామకంపై వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.



పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన పాలకమండలిలో చైర్మన్ తో కలిపి మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత కూడా ఉన్నారు. ఆమె క్రిస్టియన్ మతస్థురాలు


ఇది తెలిసిచేశారా? తెలియక చేశారా? అన్నదాని కంటే పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో అన్యమతస్తులు సభ్యులుగా ఉండరాదన్నది ప్రస్తుతం సమస్యగా తయారైంది.  టిటిడి పాలకమండలిలో తాను క్రిష్టియన్ అయి ఉండి  ఆ పదవిలో ఆమె ఎలా చేరారు? ఇంతమాత్రం ఇంగితం లేదా? చేరిన టిడిపి ఎమెల్యే  అనిత వ్యవహారం మొత్తం వివాదాస్పదమైంది.


అనిత వ్యవహారంలో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారా? ఆమె క్రిస్టియన్ అని తెలియక ఆమెను ధర్మకర్తల మండలిలో సభ్యురాలిగా చేశారా? ఇప్పుడు ఆమె నియామకం పై చంద్రబాబు వెనకడుగు వేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది.


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను అధికారికంగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ బోర్డు సభ్యుల జబితాలో క్రిస్టియన్ అయిన వంగలపూడి అనితను నియమించారని విమర్శలు గుప్పున చెలరేగాయి. అసలిదెలా జరిగిందనేది పెద్ద కలవరం కలిగించింది.

 

 విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను పక్కా క్రిస్టియన్ అని అనిత ఆ వీడియోలో వెల్లడించారు. తన బ్యాగులోనూ తన గదిలోనూ బైబిల్ ఉంటుందని వెల్లడించారు. అనిత ఇంటర్వ్యూ వనిత టివిలో వచ్చిన బైట్ కింద ఉంది చూడండి.


దీంతో ఆమె క్రిస్టియన్ కాబట్టి ఆమెను తక్షణమే బోర్డు సభ్యురాలిగా తొలగించాలని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీలోనూ ఆ వీడియో తెగ సర్యూలేట్ అవుతోంది. దీంతో ఈ ముచ్చట కాస్తా, టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు నోటీసుకు వెళ్లింది.  వంగలపూడి అనిత గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ సైతం బాబు పరిశీలనకు వెళ్లింది.


దీంతో ఆమె క్రిస్టియన్ అనే విషయం తెలియక పోస్టు ఇచ్చామన్న భావనలో టిడిపి నేతలు సైతం ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఆమె మతం విషయంలో విచారణ జరుపుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆమె తనకు తానే క్రిష్టియన్ అని చెప్పుకుంది. ఇంత ముఖ్యమైన మత పదవిని అంత నిర్లక్ష్యంగా అన్యమతస్తురాలికి తాను హిందువై ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా కేటాయించారనేది  అందరి మనసులను తొలిచే ప్రశ్న? అసలు చంద్రబాబు కేమైంది? 


విచారణ అనంతరం అనిత  టిటిడి బోర్డు సభ్యత్వం చంద్రబాబు  రద్దు చేసే అవకాశాలున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నయి. తానే స్వయంగా క్రిష్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె పోస్టు కంటిన్యూ చేస్తే వివాదం పెద్దగా మారే ప్రమాదముందని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఛైర్మన్ గా నియమితులైన పుట్టా సుధాకర్ క్రిస్టియన్ అని కొన్ని వర్గాలు అలజడి రేపాయి. అయితే సుధాకర్ పక్కా యాదవ్ అని చెబుతున్నారు. అంతేకాదు సుధాకర్ కు మద్దతుగా యాదవులు ఆందోళనకు దిగారు. దీంతో టిడిపి ప్రభుత్వం ఆయన నియామకాన్ని కొనసాగించింది.


కానీ ఇప్పుడు అనిత విషయంలో ఆధారాలతో సహా ఆమె క్రిస్టియన్ అని తానే చెప్పిన వ్యవహారం బయటకు రావడంతో సిఎం చంద్రబాబు తన నిర్ణయం మార్చుకునే అవకాశాలున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అతి కొద్ది సేపట్లోనే అనిత నియామకం రద్దయ్యే అవకాశముందని టిడిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది.


ప్రభుత్వం టీటీడీ కొత్త పాలకమండిలి లోకి ఒక అన్య మతానికి అంటే క్రిస్టియన్‌ మహిళను నియమించడం వివాదస్పదం అవుతోంది.  ఇలా ఒక క్రిస్టియన్‌ హైందవ మత కేంద్రమైన టీటీడీ బోర్డులో సభ్యురాలుగా నియమించడం ఎలా జరిగింది?  ఒక వేళ సిఎం పొరబాటున ఎంపిక చేసినా శాసనసభ్యురాలై ఉండి ఆమైనా నిజం చెప్పకుండ పదవి దొరికిందే తడవుగా ఎలా పీఠమెక్కిందని – ఈ సంఘట్టన పట్ల హిందూ పీఠాధిపతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎవరూ ప్రశ్నించక పోతే ఆమెనే కొనసాగి ద్ధామని చంద్రబాబు కొనసాగుదామని అనిత ఏకమైపోయారా? ఒక్కసారిగా తిరుమల పై అన్యమతస్తుల దాడి తీవ్రమవటం హిందువులకు మానసిన క్షోభను కలిగిస్తుంది.  

 

ఇదే అంశంపై స్వామి పరిపూర్ణానంద టీడీపీ ప్రభుత్వ పని తీరును ప్రశ్నించారు. టీటీడీ నూతన పాలకమండలిలో ఒక  క్రిస్టియన్‌కు అవకాశం ఇవ్వడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  ఇదేం గ్రహచారమని, ఇదేం న్యాయమంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టిటిడి పాలకమండలి పదవి ఆధ్యాత్మిక పరమైనదని ఇది రాజకీయ పునరావాసం కాదని చంద్రబాబు ప్రభుత్వాన్ని గర్హించారు. హిందువుల మౌనాన్ని చేతకాని తనంగా భావిస్తున్నారా? అని ఆయన నిలదీశారు.

 

జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రభుత్వ తీరును ప్రశ్నించే సమయం ఆసన్నమైందంటూ,  గతంలో వనిత టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అనిత తాను స్వయంగా క్రిస్టియన్ అని చెప్పిన వీడియోను తన ఫేస్‌ బుక్‌లో ఆయన పోస్ట్ చేశారు. అసలు – సిఎం కు ఆమె క్రిస్టియన్ అని తెలియదనుకున్నా ఆమె ఎలా ఆ పదవిని అంగీకరిం చిందని ఆమె విశ్వసనీయతను హిందువులంతా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అనిత టీటీడీ మెంబర్ గా నియమించడాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ విషయం రాబోయే రోజుల్లో తీవ్ర వివాదస్పదమయ్యే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: