బావ చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడాలని బామ్మర్ది బాలకృష్ణ మోడీని ధారుణంగా!

జగన్మొహనరెడ్డి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతుండటం చూస్తే టీడీపీకి భయం పట్టుకుందని బీజేపీ శాసన సభ్యుడు విష్టు కుమార్‌ రాజు అన్నారు. తన జన్మ దినం నాడైనా నారా చంద్రబాబు నాయుడు యదార్ధాలు మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ, ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు నాయుడు కాదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఎమ్మెల్యే విష్టుకుమార్‌ రాజు మండిపడ్డారు. కొందరి డైరెక్షన్‌లో బాబు నడు స్తున్నారు. టీడీపీ కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే అని బీజేపీ ఎమ్మెల్యే విష్టు కుమార్‌ రాజు ఎద్దేవా చేశారు. 


చంద్రబాబు ధర్మాపోరాట దీక్షలో సినీనటుడు బాలకృష్ణ మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది నిజం కాదా ఆని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు.


ధర్మదీక్ష పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షలో హిందూపురం శాసనసభ్యుడు తెలుగు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి సత్యమూర్తి తీవ్రంగా ఖండించారు. 

అసలు తెలుగే సరిగా మాట్లాడలేని ఈ బాలకృష్ణ మహాశయుడు హిందీ లో ప్రధాని మోదీ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పుడూ మహిళల గురించి హేళన గా మాట్లాడే బాలకృష్ణకు, ప్రధాని నరెంద్ర మోదీ గురించి మాట్లాడే అర్హత లేదంటూ మండి పడ్డారు. నరెంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన బాలకృష్ణ పై కేసులు పెడతామని తెలిపారు. 

ప్రధాని నరెంద్ర మోదీపై విమర్శలు చేసిన నందమూరి బాలయ్య తన నోరును పినాయిల్‌తో కడుక్కోవాలని సూచించారు. గతములో నేరచరిత్ర ఉన్న వ్యక్తి బాలకృష్ణ అని, గతంలో తన నివాసం లోనే ఆయన కాల్పులు జరిపారని ఈ సందర్భంగా సత్యమూర్తి గుర్తుచేశారు. బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా ఒక మెంటల్ హాస్పిటల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సూచించారు. బీసీ నేత అయిన నరెంద్ర మోదీ ప్రధాని గా ఉండటాన్ని చంద్రబాబు తట్టు కోలేకపోతున్నారని విమర్శించారు.

"స్క్రిప్ట్" ఉంటేనే బాలయ్య హీరో అని, లేకపోతే "జీరో" నేనని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు విల్సన్, రమేష్ నాయుడు, కోటేశ్వరరావులు హైదరాబాద్‌ లో ఇక్కడి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ నోరు తెరిస్తే బూతు పురాణాలే మాట్లాడతారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గానూ బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఏపి ముఖ్యమంత్రి  చంద్రబాబుది ధర్మదీక్ష కాదని, అధర్మదీక్ష అని విమర్శించారు. నారా చంద్రబాబునాయిడు అవినీతి, అసమర్ద పాలన అని మండిపడ్డ నేతలు. ధర్మదీక్ష పేరుతో ₹20 కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.





ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షచేస్తున్న శిబిరంలో 'ఎన్.టి.ఆర్ డూప్'ను పెట్టి కామెడి చేస్తారా అని వైసిపి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.సీరియస్ గా జరగవలిసిన దీక్షను ప్రహసంగా మార్చారని ఆమె అన్నారు. 'ఎన్.టిఆర్ డూప్' ను పెట్టడం ద్వారా ఆయనను అవమానించారని ఆమె అన్నారు.చంద్రబాబు ఈ దీక్ష ఏదో డిల్లీలో చేసిఉండాల్సిందని ఆమె అన్నారు చంద్రబాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని ఆమె అన్నారు. టిడిపి ఎమ్.పిలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ఆమె ప్రశ్నించారు.ప్రభుత్వపరంగా ఇంత ఖర్చు చేసి దీక్ష చేయడం దారుణంగా ఉందని ఆమె అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: