నోట్లరద్దు చెత్త ఆలోచనగా మిగిలింది - జీఎస్‌టీ బెష్ట్ : రఘురాం రాజన్

"నిజాయతీ లేని ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు వారినే ప్రతిబింబిస్థాయి"

"ఏ నిజాయతీతో కూడిన ప్రణాళికైనా ప్రజల స్వార్ధానికి బలవ్వల్సిందే"

"సమాజాన్ని మొదట భయపెట్టైనా నిజాయతీ నింపి ఆ తర్వాతే అర్ధిక ప్రయోగాలు చెయ్యాలి"  
  

పెద్ద నోట్ల రద్ధు ప్రకటనకు భయపడి పన్నులు ఏగేసిన ప్రజలు తమ పాతర్లలో, బోరాల్లో దాచిపెట్టిన సొమ్ము బయటకు తెచ్చి పన్నులు కడతాం మహాప్రభో! అంటారని భావించిన భారత ప్రధాని నరెంద్ర మోడీకి జాతి మొత్తం ఝలక్ ఇచ్చింది. బాంకుల్లో రెండు లక్షల వరకు జమ చేసిన నగదుపై లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని అమాయకంగా చేప్పిన ఆర్ధిక శాఖ రిజర్వ్ బాంక్ మాటలకు ఒక్క సారిగా అన్నీ బాంకుల్లో నిద్రాణంగా పడిఉన్న ఖాతాలు (డార్మాంట్ ఖాతాలు) ఊపిరి పోసుకొని చలనం చేస్తూ ఉర్రూతలూగించాయి. కోటీస్వరుల నేల మాళిగలు మూలుగుతున్న నల్లధనం మాళిగను బ్రద్దలు కొడుతూ నోళ్ళు తెరచుకొని పేదవారి ఖాతాల్లో ప్రవహించి అమాంతం "పాన్" ఉన్న పేదవాళ్ళు లక్షాధికారులయ్యారు. 


నిజాయతీ నిండుకున్న ప్రజలెన్నుకున్న సమర్ధ ప్రభుత్వాలకు కావలసింది అభెధ్యమైన వ్యూహం. దానికి పకడ్బందీ పధకం చేదించలేని ప్రణాళిక సిద్ధం చేసుకున్న తరవాతే ఇలాంటి పథకాలను ప్రభుత్వాలు అమలు చేయ పూనుకోవాలి. అనుభవలేమి వలన తీసుకున్న మంచి నిర్ణయాలకు సమర్ధవంతమైన ఆర్ధికవేత్తల నియంత్రణ అవసరం. లేకపోతే ఈ నోట్ల రద్ధు తుగ్లక్ నిర్ణయం లాగా అపహస్యం అయివుండేది కాదు. అదే చెప్పారు మరోసారి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. 
      
భారత ప్రధాని నరెంద్ర మోదీ సర్కారు 2016నవంబర్‌లో తీసుకున్న 'పెద్ద నోట్ల రద్దు - డీమోనిటైజేషన్‌' నిర్ణయంపై భారత రిజర్వ్ బాంక్ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు. నోట రద్దు మంచి ఆలోచన కాదని అప్పుడే తాను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. అంతేకాకుండా వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన కరెన్సీ నోట్లను రద్దు చేసే ప్రక్రియను తగిన ప్రణాళిక లేకుండా చేపట్టారని కూడా ఆయన కుండ బద్దలు కొట్టారు. 


ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, డీమోనిటైజేషన్‌ నిర్ణయాన్ని అమలు చేసేముందు ప్రభుత్వం ఆర్‌బీఐ ని సంప్రదించలేదన్న వాదనలను రఘురాం రాజన్‌ తోసిపుచ్చారు. 2016 నవంబర్‌ 8న నరెంద్ర మోదీ ప్రభుత్వం ₹.500, ₹.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

రద్దైన నోట్ల స్థానంలో కొత్తగా మళ్లీ ₹.2,000, ₹.500 నోట్లను వెంటనే ప్రవేశపెట్టారు. తర్వాత కొంతకాలానికి ₹.200 నోటును కూడా కొత్తగా తీసుకొచ్చారు. అయితే, తగినన్ని కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లుపడ్డారు. రఘురాం రాజన్‌ హయాం లోనే నోట్ల రద్దు పై ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టినప్పటికీ, 2016 సెప్టెంబర్‌ లో ఆయన పదవీకాలం పూర్తయ్యాక మాత్రమే, ప్రస్తుత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ హయాంలో దీన్ని అమలు చేసింది. 


అప్పట్లో రఘురాం రాజన్ రెండోసారి అర్ భి ఆఇ గవర్నర్‌గా కొనసాగాలని భావించినా అందుకు నరెంద్ర మోడీ ప్రభుత్వం మొగ్గు చూపలేదని కూడా రఘురాం రాజన్‌ చెప్పడం విశేషం. నోట్ల రద్దు ఇతరత్రా అంశాల్లో నరెంద్ర మోదీ ప్రభుత్వంతో తలెత్తిన విభేదాలే రఘురాం రాజన్ నిష్క్రమణకు ప్రధాన కారణం. ప్రస్తుతం ప్రొఫెసర్ రఘురాం రాజన్‌ షికాగో యూనివర్సిటీలోని 'బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌' లో తనకెంతో ఇష్టమైన ఆర్థికశాస్త్ర ఉపన్యాసకునిగా తన పూర్వాశ్రమ విధుల్లో కొనసాగుతున్నారు.
"భారత ఆర్ధిక వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన పెద్ద నోట్లను రద్దు చేయాలంటే ముందుగా దానికి తగ్గట్టుగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీ లోకి తీసుకొని వచ్చేందుకు సిద్ధపడాలని ఏ ఆర్థికవేత్త అయినా చెబుతారు.

అయితే, భారత ప్రభుత్వం ఇలాంటి కసరత్తును పూర్తిగా చేయకుండానే ఆదరాబాదరాగా డీమోనిటైజేషన్‌ - నోట్ల రద్ధును  ప్రకటించింది. దీనివల్ల: 
*ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. 
*ఈ నిర్ణయంతో ప్రజలు నల్ల ధనాన్ని నేలమాళిగల్లోంచి బయటకు తెచ్చేసి, లెంపలేసుకొని పన్నులు కట్టేస్తారనేది ప్రభుత్వం ఆలోచన. 
*అయితే, ఇది అవివేకమైన నిర్ణయం అనేది రఘురాం అభిప్రాయం. 

ఎందుకంటే ప్రజలు కొత్త వ్యవస్థలకు వేగంగా అలవాటుపడిపోయి, కొత్త దారులు వెతుక్కుంటారన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయింది. రద్దు చేసిన నోట్లకు సమానమైన మొత్తం వ్యవస్థ లోకి మళ్లీ తిరిగివచ్చేసిందంటే, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని చేపట్టిందో అది నెరవేరనట్టే లెక్క. ప్రత్యక్షంగా దీని ప్రభావంలేదని తేటతెల్లమైంది. కరెన్సీకి కటకటతో ప్రజలు ఇబ్బందుల పాలు కావడం ఒకెత్తు అయితే, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతో అసంఘటిత రంగంలో భారీగా ఉద్యోగాలు ఊడిపోయాయి. 

సన్నాహాలు లేకుండా నిర్ణయం, ఏ సంస్కరణైనా,  సమర్థ ప్రణాళికతోనే విజయవంతం 

అయితే, దీర్ఘకాలంలో దీనివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందనేది వేచి చూడాలి. ప్రధానంగా పన్నుల వసూళ్లపై ప్రభుత్వం గనుక సీరియస్‌గా దృష్టిసారిస్తే, ఖజానాకు ఆదాయం పెరుగు తుంది. ఇది నెరవేరిందని బలంగా నిరూపితం అయితేనే సానుకూల ప్రభావం ఉన్నట్లు లెక్క. తనవరకైతే ఆ సమయంలో నోట్ల రద్దు అనేది నిరుపయోగమని భావించానని రఘురాం రాజన్‌ వివరించారు.

అయితే వస్తు, సేవల పన్ను-జీఎస్‌టీ మెరుగ్గా అమలు చేయగలిగితే భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మంచిదే నని రఘురాం రాజన్‌ వ్యాఖ్యానించారు. "ఇదేమీ సరిదిద్దలేనంత పెద్ద సమస్య కాదు. అయితే, మరింతగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. జీఎస్‌టీ పై నాకు ఇంకా విశ్వాసం ఉంది" అని పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: