లోక్‌సభలో సేమ్ సీన్..ఉభయ సభలు వాయిదా

Edari Rama Krishna
లోక్‌సభలో ఆరో రోజూ సేమ్ సీన్ రిపీటైంది.  సభ ప్రారంభం కాగానే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో వీరోచిత పోరాటాన్ని ప్రదర్శించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల ప్రాణత్యాగాన్ని స్పీకర్ గుర్తు చేశారు. కాసేపు మౌనం పాటించారు. సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 12గంటలకు లోక్‌సభ వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదా పడింది. 


సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపడుతుండగా.. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు యాక్షన్‌లోకి దిగారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకుని వెల్‌లోకి దూసుకెళ్లడంతో పదే పదే సభ్యులకు స్పీకర్ చెప్పినప్పటికీ వారు మాత్రం మరింత ఆందోళన ఉదృతం చేయడంతో చేసేదేమీలేక సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 12గంటలకు సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.గత నాలుగు రోజుల నుంచి లోక్‌‌సభ ప్రారంభమైన సరిగ్గా 30 సెకన్లకే లోక్‌సభ వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.   
 
రాజ్యసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఏపీకి ప్రత్యేక హొదా డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ.. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్, కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు ప్లకార్డులు చేబూనీ స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు కొనసాగించారు.  సభ్యుల ఆందోళనతో సభా సజావుగా నడిచే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: