ఏపి లో ఆ రెండు పార్టీ లు కలిస్తే వార్ వన్ సైడ్..!

Prathap Kaluva
ఏపి లో ప్రస్తుతం రాజకీయాలు యమా రంజు గా ఉన్నాయి. దానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ అది కూడా టీడిపి మీద ఓ రేంజ్ లో చెలరేగిపోయాడు. దీనితో 2019 లో మన పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు లే అని అనుకున్న బాబు కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అయితే 2019 లో పార్టీల సెట్టింగ్స్ ఎలా ఉండబోతున్నాయని అందరికి ఆసక్తి కరంగా మారింది.

అయితే పవన్ కళ్యాణ్ తన తన ప్రసంగంలో విపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పై కూడా ఒకటి, రెండు విమర్శలు చేయకపోలేదు. నిజానికి విపక్షంపై విమర్శలు చేయడానికి కూడా పెద్దగా ఏముంటుంది? ప్రభుత్వంలో ఉన్నవారి వ్యవహారాలే కదా ప్రజలను ప్రభావితం చేసేది. పవన్‌ ఇంతకాలం చంద్రబాబు పార్టనర్‌ అన్న అభిప్రాయం ఉండేది. దానిని పవన్‌ పటాపంచలు చేసి, ఇక తాను చంద్రబాబు జట్టులో లేనని స్పష్టం చేసినట్లయింది. ఒకటి, రెండు ఆరోపణలు అయితే విపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ కూడా చేయలేదు.

ముఖ్యంగా చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు నోట్లరద్దు సమయంలో పట్టుబడ్డ శేఖర్‌ రెడ్డికి సంబంధం ఉందని పవన్‌ కళ్యాణ్‌ అనడం సంచలనమే. ఇసుక మాఫియాల గురించి , కాంట్రాక్టుల గురించి, ప్రభుత్వంలో ఉన్న అవినీతి గురించి ఉతికి ఆరేసిన తీరుచూస్తే ఇంతకాలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలన్నిటిని పవన్‌కళ్యాణ్‌ సమర్దించినట్లయింది. జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ ఒకే  వేదిక మీదకు వచ్చే అవకాశం ఉందో, లేదో చెప్పలేం. అలా జరిగితే వచ్చే ఎన్నికలలో ఫలితం ముందుగానే రాసినట్లు అవుతుంది. వీరికి పూర్తి అనుకూలంగా ఫలితం ఉంటుందనడంలో సందేహంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: