అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్..!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారు.  రాష్ట్రా రాజధాని అమరావతి కోసం ఆయన అహర్శిశలూ కష్టపడుతున్నారు.  అయితే విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అది నెరవేర్చలేదు. అంతే కాదు ఈ మద్య కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం మొదలైంది. 

రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటినా కేంద్ర ఇచ్చిన హామీ నెరవేరుస్తుందని ఇప్పటి వరకు ఎన్నో అశలు పెట్టుకున్న అధికార పార్టీ సైతం ఇప్పుడు కేంద్రంపై నిప్పులు చెరుగుతుంది.  ఓ వైపు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీల ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు.  ఇదిలా ఉంటే గుంటూరు లో కలుషిత నీటి వల్ల 10 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు గుంటూరు లో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు మొదలయ్యాయి..జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ బాధితులను ఆదుకోవాలని..లేని పక్షంలో బంద్ నిర్వహిస్తామని చెప్పారు. 

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పందిస్తూ..గుంటూరులో కలుషిత నీటి వల్ల 10 మంది దుర్మరణం చెందడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు శాఖాపరమైన వైఫల్యమే కారణమని అన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి వైఫల్యం వల్ల 10 మంది చనిపోయారని అన్నారు.  గతంలో విశాఖలో హుదూత్ తుఫాన్ అతలాకుతలం చేసినప్పుడు... మనమంతా ఎలా చేశామని... గుంటూరులో ఆ స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు.

అధికారుల పనితీరు ప్రభుత్వ గౌరవాన్ని పెంచేలా ఉండాలని చెప్పారు. రోడ్లను తవ్వడం, గుంతలను అలాగే వదిలేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. వైపు లైన్ల లీకేజీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, మురుగు కాల్వలను వెంటనే శుభ్రపరచాలని ఆదేశించారు.  అలసత్వం ప్రదర్శించే అధికారులను సహించబోనని హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: