ప్రజలను నట్టేట్లో ముంచి ప్రత్యేక హోదా అమ్మేసుకున్నారు

ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "ఓటుకు నోటు కేసు" నుంచి బయటపడటానికే  "ప్రత్యేక హోదా" ను అమ్మేశారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. మంగళవారం చంద్రబాబును పలు అంశాలపై  ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు.

"ఓటుకు నోటు - కేసు లో భయపడే హైదరాబాద్‌ నుంచి విజయవాడకి పారిపోయి వచ్చారు, ప్రత్యేక హోదా అమ్మేస్తాను అరెస్టు నుంచి కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టు కున్న  విషయం నిజం కాదా" అని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి ఖర్చుల లెక్కలు చెప్పలేకే  "ప్రత్యేక హోదా పేరు" తో రోడ్డెక్కితే ప్రజలు గుర్తించలేరను కోవడం చంద్రబాబు మూర్ఖత్వమే అవుతుందని ముద్రగడ అభిప్రాయపడ్డారు. పదే పదే చెప్పినంత మాత్రాన 'అబద్ధం నిజమవదని' ఆయన అన్నారు.   

ప్రత్యేక హోదాపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు తప్ప, సాధించాలనే తాపత్రయం గాని, ప్రత్యేక హోదా రాదనే వెదనా బాబుకు లేదని కారణం ఆయన కారు చవకగా అమ్మేసినారు కాబట్టని మండిపడ్డారు. ఈ నాలుగు సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చా రని ఆయన ప్రశ్నించారు. మీపైగాని, ప్రభుత్వంపై గాని ప్రశ్నిస్తే దాడి చేయించడం, అక్రమ కేసులు పెట్టించడం సిగ్గు అనిపించటం లేదా? అని లేఖలో నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: