బీభత్సం సృష్టించిన చిరుతపులి...వీడియో వైరల్..!

Edari Rama Krishna
సాధారంగా కృరజంతువులు అంటే అందరికీ చచ్చేంద భయం. అలాంటిది కృర జంతువులు ఊళ్ల పై పడి అప్పుడప్పుడు బీభత్సం సృష్టించడం తరచూ చూస్తుంటాం. కొన్ని సార్లు అడవుల నుంచి పులులు, సింహాలు, ఎలుగు బంట్లు ఆహారం కోసం..దాహం కోసం గ్రామాల్లోకి రావడం..దాన్ని చూసి జనాలు భయంతో పరుగులు తీయడం లాంటి సంఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో చూశాం. 

తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జనావాసాల్లోకి వచ్చి ఓ చిరుతపులి బీభత్సం సృష్టించింది. ఇండోర్‌లోని పలహార్‌ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలోకి చిరుతపులి వచ్చింది. దీన్ని గమనించిన కాలనీవాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు చిరుతను పట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు.

ఈ క్రమంలో ఆ చిరత పలువురిపై దాడి చేసింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఒక ఇంటి పై నుంచి మరో ఇంటిపైకి దూకుతూ నానా బీభత్సం చేస్తూ.. కాలనీవాసులు, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. చివరకు అటవీ అధికారులు మత్తు ఇంజెక్షన్‌ల సాయంతో సజీవంగా పట్టుకోని జూకు తరలించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: