కెటిఆర్ లాంటి దురహంకారిని ఇంకెప్పుడూ పట్టించుకోను: సిఎల్పి నేత జానారెడ్డి

తెలంగాణా ఏర్పడ్డాక తెలంగాణా ముఖ్యమంత్రి మాట తీరులో మార్పు రాకపోగా ఆయనలో అహంకారమదం ఆయనలో తీవ్ర స్థాయికి చేరిందని మొన్న నరెంద్ర మొడీని "మోడీ గాడు" అనటంలోనే ఆయనది ఎంత నీచ సంస్కృతో భారత జాతి గుర్తించింది. అదే భావన భారత రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాటల్లో వ్యక్త మైంది. అదే విధంగా ఆ అధికార దుర్మధాంధం అనే జబ్బు ఆయన పుత్రరత్నం రాష్ట్ర ఐటి శాఖామంత్రిలో అణువణువునా నిండి పోయింది. తెలంగాణా లోనే సీనియర్ రాజకీయవేత్త, సౌమ్యుడైన కాంగ్రెస్ శాసనసభానాయకుడు కుందూరు జానారెడ్డి గారిని "జానా బాబా" సంభోదిస్తూ ఆయన్ని హేళన చేయటం కేటిఆర్ లో ప్రదర్శించిన నీచస్థాయి సంస్కృతి తన తండ్రిని మించి పోయిందంటున్నారు వీరిద్ధరిని చూసిన తెలంగాణా ప్రజలు.
 
     
"కేటీఆర్‌ వ్యాఖ్యలపై నేను స్పందించడం ఇదే ఆఖరు. అధికార అహంకారం తో హేళనగా, సంస్కారహీనంగా మాట్లాడితే నేను స్పందించను. పైస్థాయి వాళ్లను తిడితే పెద్దవాళ్లమైపోతామని అనుకోవడం భ్రమ. అది నాయకత్వ లక్షణం కాదు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు" అని సీఎల్పీ నేత జానారెడ్డి తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటిఆర్ కు హితవు చెప్పారు.  "జానా బాబా.. 40 దొంగలు" అంటూ మంత్రి కె. తారకరామారావు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు జానారెడ్డి మండిపడుతూ ఘాటుగా స్పందించారు. 

కేటీఆర్‌కు కౌంటర్‌ ఇవ్వడం తన స్థాయికి తక్కువే అయినా ఆయనకు హితవు చెప్పాలనుకుంటూ చివరగా మాట్లాడుతున్నానంటూ చురకలు వేశారు. అధికారగర్వంతో హేళన, కుసంస్కారం తో అర్థంపర్థం లేని విధంగా మాట్లాడటం సరైంది కాదు అని మంత్రికి హితవు పలికారు. తన కన్నా ఎక్కువ స్థాయి వాళ్ల గురించి మాట్లాడితే పెద్దవాడి ని అయిపోతానని  కేటీఆర్‌ భ్రమలో ఉన్నారని జానారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు కేటీఆర్‌ చేసిందేమీ లేకపోగా ఒక ముఠాను తయారు చేసుకొని ఊతపదాలతో ప్రజల ను ఊదరగొడుతూ తాము గొప్పవాళ్ళుగా భ్రమింపజేసుకుంటున్నారని  విమర్శించారు.


గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో జానా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలకు తానే ఆద్యం పోశానన్నారు. లక్షా 70వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చేశానని  ఇప్పుడు కేటీఆర్‌ ప్రారంభించిన పథకానికి కూడా తానే శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. పాలేరు కట్ట మీద వేసిన శిలాఫలకం పైనా తన పేరుంటుందని, కావాలంటే చూసుకోవచ్చన్నారు. ఎవరో ఇల్లు కట్టిన తర్వాత దానిపై పెంట్‌-హౌస్‌ వేసి తామే ఇల్లంతా కట్టినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకుని తిరుగుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక్కసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని జానా రెడ్డి జోస్యం చెప్పారు. 

అసెంబ్లీలోని మీడియా హాల్‌లో గురువారం జానా మాట్లాడుతూ కేటీఆర్‌ అర్హతకు మించి అహంకారం తో మాట్లాడటం తగదన్నారు. "మౌనం వహిస్తే బెదిరిపోయారని అంటారనే" సూచనకు తలొగ్గి మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలపై కేసుల గురించి మాట్లాడే ముందు కేసీఆర్‌పై ఉన్న కేసుల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు.

అధికారంలోకి వస్తే తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకోవడం ప్రతి పార్టీ చెప్పుకోవచ్చు. అందుకే ప్రజా చైతన్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి పక్షం మాట్లాడ కూడదనే తీరులో టీఆర్‌ఎస్‌ వ్యవహరించడం విచారకరమన్నారు. టీ ఆర్‌ ఎస్ కు అసలు తమ గురించి తమ పార్టీ గురించి మాట్లాడే అర్హతగాని హక్కు గాని ఉందా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ అడిగితే సిరిసిల్ల కు నిధులు కేటాయించానని, ఈటల రాజేందర్‌ కూడా తన నియోజకవర్గానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ నిధులుమంజూరు చేయించుకున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: