డిపీఅరే లేని ప్రతిష్టాత్మక అమరావతి రాజధాని ప్రోజెక్ట్ కు నిధులెలా ఇస్తారు?


అమరావతి నగరం విశ్వంలోనే అద్భుతమన్నారు. అలా నిర్మిస్థామని అనేక దేశాల రాజధానులను వ్యక్తిగతంగా దర్శించిన తరవాతనే కాకుండా పలు సంధర్భాల్లో మంత్రు లు నారాయణ, లోకేష్ లనేకులు ఉద్ఘాటించారు. దర్శకుడు రాజమౌళితో రాజధాని రూపు రేఖల విషయంలో అనేక ఊహాచిత్రాలను ప్రజలకు చూపించారు బాహుబలి లోని మాహిష్మతి నగరాన్ని. కొంత కాలం సింగపూరంత మరికొంతకాలం కౌలాలంపూరంత మరికొంతకాలం ఖజకిస్తాన్ రాజధాని ఆస్థానంత ఇంకా అంత కంటే గొప్పగా నిర్మిస్థామని చెప్పిన అధికారపార్టీ నాయకత్వం ఇంతవరకు రాజధాని నగరానికి  "డిపిఆర్ - డిటెయిల్డ్ ప్రోజెక్ట్ రిపోర్ట్" ను రూపొందించి కేంద్రానికి సమర్పించలేదని తెలుస్తుంది.


"ఉదయించే సూర్యుని రాష్ట్ర రాజధాని"  నిర్మాణం కోసం ఎలాంటి  డీపీఆర్ రూపొందించలేదని, అలాంటి సందర్భంలో నిధులు కేటాయింపు ఎలా జరుగుతుందని రాష్ట్ర భాజపా  నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. ఇప్పటికే రెండు వేల కోట్లు రూపాయిలు కేంద్రం ఇచ్చిందని, డీపీఆర్ వస్తే తగినన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.


కనీసం బాంకుకు ఋణం కోసమెళితే చిన్న చిన్న పరిశ్రమలకు నిర్మానాలకు డిపిఆర్ సమర్పిస్తాం. అలాంటిది "విశ్వం లోనే అద్భుతనిర్మాణం" అనబడే అమరావతి మహానగరం నిర్మాణానికి నిధులు కావాలంటే డిపిఆర్ సమర్పించాలసిందే కదా!  డాక్యుమెంటేషన్ లేకుండా పనులెలా జరుగుతాయి అంటున్నారు ఇది విన్న జనం.  అయితే బడ్జెట్ లో కేటాయిపులు ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ కు యివ్వలేదనటానికి సమాధానంగా: 

  

"ఒక్క రాష్ట్రాన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉండవని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారని ఆ పార్టీ నేత పురంధేశ్వరి చెప్పారు. బడ్జెట్‌పై ఏపీ సీఎంతోపాటు టీడీపీ నేతలు అసంతృప్తి చేశారన్న విషయంపై అమిత్ షా పై విధంగా స్పందించారని, కేంద్ర బడ్జెట్ దేశం లోని అన్ని రాష్ట్రాలను, దేశ ప్రజలను దృష్టిలో ఉంచు కుని బడ్జెట్ రూపొందించడం జరుగుతుందని" అమిత్ షా చెప్పారని పురంధేశ్వరి తెలిపారు. ఈ విషయం చంద్రబాబు కు తెలియంది కాదని కూడా అమిత్ షా అన్నారనితెలిపారు. "రైల్వే జోన్" అంశాన్ని బడ్జెట్తో ముడిపెట్టడం సరికాదని అన్నారు.


రాష్ట్రానికి కేటాయించాల్సిన అన్ని అంశాలను బడ్జెట్‌ లో చేర్చడం కుదరని అన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని పురంధేశ్వరి చెప్పారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన భుజాలపై వేసుకున్నారని తెలిపారు. ప్రజాధనాన్ని వృథాకాకుండా చూశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టువ్యయం  పెంచాలని కోరిందని, అయితే పాత ధరలకే నవయుగకు పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చామని పురంధేశ్వరి తెలిపారు. దీంతో ప్రజాధనం చాలా వరకు వృథాకాకుండా చూశామని తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు తెలపాలని అమిత్ షా సూచించారని తెలిపారు. రాష్ట్రంలో బాజపా బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు.


మిత్రధర్మానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దని ఈ సందర్భంగా అమిత్ షా నేతలకు సూచించారు. "విశాఖ రైల్వే జోన్‌ అంశం" పై ఒడిశాతో చర్చలు జరుపుతున్నామని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్‌కు ఎలాంటి నిధుల సమస్య ఉండదని అమిత్ షా స్పష్టం చేశారు. నాబార్డు రుణాలు ఇస్తున్నందున పోలవరాన్ని బడ్జెట్‌ లో ప్రస్తావించలేదన్నారు. ఈ విషయాన్ని నితిన్‌ గడ్కరీతో కూడా చర్చించామని నేతలతో అమిత్‌షా వివరించారు.


దీన్నిబట్టి నాలుగేళ్ళయినా ఇంకా పుట్టని "అండంలోని పిండానికి"  తెలుగుదేశం వాళ్ళు " అమరావతి అనిపేరెట్టి - విశ్వ నగరమని పదే పదే చెప్పటం వెనక మతల బేంది?  "గుడిని గుళ్ళో లింగాన్ని మింగేసే ప్రణాళిక ఏమైనా ఉంటే" బాజపా మొగ్గలోనే తుంచేసిందా?  అంతా " అమరావతి అసలు రహస్యం" అనే సినిమాని ఎన్నికల సమయంలో వీక్షిస్థాం అని అనుకుంటున్నారు ఆంధ్ర ప్రదేశ్ వాసులు.


కేంద్రం రాష్ట్రంపై శీతకన్ను వేసినప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ వ్యవస్థలద్వారా పనులు సాధించుకునే అవకాశం ఉండగా రాజ్యాంగ పదవిలో దశాబ్ధం పాటు ఉంది, ఇప్పుడు మరో దశాబ్ధం పాటు రాష్ట్రాన్ని పాలించనున్న మాననీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా?  అనేదే 'మహామర్మం'. తన రాజకీయ చాణక్యంతో ఒకనాడు దేశాన్ని ఉర్రూతలూగించిన ఈయన రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకొని  "కుతంత్ర మోడీయం" ను  పాతరవేయలేరా!


రాజకీయాల్లో అధినేతల లోపాలు రాష్ట్రాలకు శాపాలు అవటం అతి సహజం. మరి  
మోదీ ఏపి ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయటం మోడీబాబుల మధ్య ఉన్న గతకాల శత్రుత్వం 
 అని ప్రచారంలో ఉన్న విషయం రాష్ట్రాభివృద్ధికి అవరోధమైతే నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి టిడిపి నుండే మరొక సమర్ధుణ్ణి ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రయోజనాలు సాధించటం అవసరం. వ్యక్తుల ప్రమేయం రాష్ట్రాభివృద్ధికి విఘాతమైనప్పుడు ఇది సరైన నిర్ణయమౌతుంది కదా! 



ఈ దిశగా జయప్రకాష్ నారాయణ గారు, చలసాని శ్రీనివాస్ గారు, నటుడు శివాజి గారు, ప్రఖ్యాత నటుడు పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు, అనుక్షణం రాష్ట్ర శ్రేయస్సు కోరే విపక్షనేత  జగన్మోహన రెడ్డి గారు కలసి కృషిచేయ వలసిన అవసరమెంతైనా ఉంది.  కోట్లాది ప్రజల ముందు "ఓటుకు నోటు కేసులో విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు" గారిని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. అందుకే ఆయన చేత రాజీనామా చేయించి "ఈ ప్రణాళికా కాలంలో రావలసిన నిధులను" రాబట్టటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకెంతైనా అవసరం అని శ్రేయోభిలాషులు ప్రజలు కోరుతున్నారు.  


"మోడీ-షా ద్వయం" ఎందుకు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించట్లేదనేది కూడా ఆలోచించాలసిందే. దీన్ని ప్రశ్నించే పని స్వయానా ఆయన భుజస్కందాలపై వేసుకున్న  పవర్ స్టార్ పవన్ కళ్యాన్  పని.  ఇక పవన్ తన ప్రతాపం — పవర్ చూపి ప్రశ్నించ వలసిన అవసరమెంతైనా ఉంది. 


స్వంత ప్రయోజనాలకోసం దిల్లీలో కూర్చున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులను ఎక్కడపడితే అక్కడ రాజ్యాబద్ధంగా నిల తీస్తే తప్ప ఆంధ్రుల ఆశలు తీరవు...తీరవంటే తీరవు. అప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకోరిక తీరకపోతే ఈ మొత్తం రాజకీయ నాయకులని కట్టకట్టుకొని రానున్న ఎన్నికల్లో రాజకీయంగా అంతం చేయటం చాలా అవసరం.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: