చెంప చెళ్లుమనిపించిన సీఎం..ఎవరినో తెలుసా!

Edari Rama Krishna
సాధారణంగా సెలబ్రెటీలు తమ బాడీగార్డులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు..ఎందుకంటే తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎంతటి రిస్కు తీసుకోనైనా సరే తమ యజమాని ప్రాణాలు కాపాడే బాధ్యత వారికి ఉంటుంది..అందుచేతనే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీవారు, పారిశ్రామికవేత్తలు తమ బాడీగార్డుపై ప్రత్యేక శ్రద్ద వహిస్తారు.  అలాంటిది రోడ్ షో సందర్భంగా తన సెక్యూరిటీ గార్డుపై సీఎం శివరాజ్ సింగ్ చేయి చేసుకున్నారు. ఓ పబ్లిక్ ర్యాలీ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహనం కోల్పోయారు.

తనకు భద్రతగా ఉన్న ఓ బాడీగార్డ్ పైన చేయి చేయిచేసుకున్నారు. ఈ వ్యవహారం అంతా కెమెరాలకు చిక్కింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. సర్దార్ పూర్‌ టౌన్‌లో ఈనెలాఖరులో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చౌహాన్ మంగళవారం పాల్గొన్నారు. ఆయన ముందుకు నడుచుకుంటూ వెళ్తూ అకస్మాత్తుగా తన పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు చెంపపై కొట్టారు.

అయితే సదరు సెక్యూరిటీ గార్డు చౌహాన్ కాలు పదే పదే తొక్కడంతో ఆయన సహనం కోల్పోయి పక్కకు జరగమని అన్నట్లుగా పార్టీ సభ్యులు, కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనం.  అయితే విపక్ష కాంగ్రెస్ మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ తీరును ఎండగట్టింది. 

ఓ పోలీసును ముఖ్యమంత్రి చెంపదెబ్బ కొట్టారని, పబ్లిక్ సర్వెంట్‌పై చేయి చేసుకున్నందుకు ఆయనపై ఎందుకు కేసుపెట్టకూడదని అని కాంగ్రెస్ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రభుత్వ ఉద్యోగిని కొట్టిన విషయంలో సీఎంను అరెస్టు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: