ఏడిటోరియల్: ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్కాం - అయితే పవన్ కళ్యాణ్ లేదంటే బాలక్రిష్ణ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం సినిమారంగంలోని "తనవాళ్లు"తో కుమ్మక్కై ప్రజలకు అన్యాయం చేస్తుంది. ఇక్కడ తనవాళ్లంటే తన కుటుంబం, తన బందు గణం, తన పార్టి ప్రజా ప్రతినిధులు, తనపార్టీ అధికారంలోకి రావటానికి సహకరించి న వేరే పార్టీ నాయకులు, తన స్నేహితులు తదితరులు. ఇక్కడ పాలన అంటే తన వాళ్ళను సరిగ్గా చూసుకోవటం, వారి బాగోగు లు వారి ప్రయోజనాలు, తమ స్వంత వ్యాపార వ్యవహారాలు మాత్రమే.సర్వకాల సర్వావస్థలయందు తన కులంవాళ్ళు, తన వందిమాగధులకు కాంట్రాక్టులు వచ్చేలా జిఓ లను మారుస్తూ రానున్న ఎన్నికలకోసం ధనం సంపాదిస్తూ గడిపెయ్యటమే.



ఉదాహరణకు ఒక సినిమాకు ప్రత్యేక ప్రయోజనాలు, వెసులు బాట్లు కలిపించటానికి వాటికి  కనీసం కొన్ని అర్హతలుండాలి. 

-సామాజిక ప్రయోజనానికి ఉద్దేసించినదై ఉండాలి 
-సంస్కృతి సాంప్రదాయాను ప్రతిబింబించాలి
-తన దేశ ప్రాంత చరిత్రను చెప్పాలి
-లేదా సామాజానికి ఏదైనా సందేశం అందించేదిలా ఉండాలి
-వ్యక్తిత్వ వికాసమో, శాస్త్రీయ పరిఙ్జానమో ప్రేక్షకులకు అందించాలి


ఇవేవి లేని సినిమాలకు వినోదపు పన్ను రద్ధు చేస్తే జనానికి ఏ ప్రయోజనం లభిస్తుంది. అదీ ప్రేక్షకులకు టిక్కెట్ ధరలో నైనా కనిపించాలి. అంతేకాని వినోదపు పన్ను తగ్గించి దాన్ని నిర్మాత జేబులోకి వెళ్ళెలా చేయటం ప్రజా ప్రయోజనం కాదు.


భీకర పోరాటాలు, మహిళలపై లైంగిక వేదింపులు, హత్యలు, మానభంగాలు, సాడిజం, మధ్యపానం, ధూమపానం, మత్తుపదా ర్ధాలు తదితర అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే లాగా చేసే సినిమాలకు రోజుకు ఏడు ఆటలు ప్రదర్శించే అనుమతు లివ్వటం ప్రజాసంక్షేమ ప్రభుత్వాలకు ఎంతవరకు సమజసమో? ఆ ప్రభుత్వ అధినేతే ఆలోచించుకోవాలి. 

అంతే కాదు ఆ కథానాయకుడు ప్రజానాయకుడు కావాలని ఉవ్విళ్ళురుతున్నాడు. ప్రజల మధ్యలోకి వచ్చినపుడు "జ్యోతిరావు పూలే అంటాడు చెగువేరా" అంటాడు. మరో కథానాయకుడైతే మహిళలపై అనాగరిక అసాంఘిక వాగ్భాణాలు సందిస్తాడు, అనా కారి వ్యాఖ్యలు చేసి....ఇద్దరు వేదికలపై ఊగిపోతారు. ఇలాంటి వ్యక్తిత్వం లేని వాళ్ళకు అభిమానులుగా ఉండేవాళ్ళు, బ్లేళ్ళు పెట్టి ఒకరి నొకరు కోసేసుకునే వాళ్ళు, వాళ్ల కోసం ప్రాణం తీసుకునే దురభిమానుల ఓట్ల కోసం కక్కురి పడే వాళ్ల సినిమాలకు ప్రయోజ నాలు, అదీ ప్రభుత్వ పరంగా అందించటం ఈ ప్రభుత్వాలకు శ్రేయోదాయకం కాదు. 


ఏ మాత్రం తెలుగువారికి సంబందం లేని వింధ్యకు ఆవల పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణికి వినోదపన్ను రద్ధు చేసిన ఉందంతం ఏ  సమాజ ప్రయొజనాన్ని ఆశించి చేశారో ప్రజలకు తెలియదా?  అది  ప్రజలకు చాలా వేదన కలిగించింది.  దీనికి కారణం ఆ సినిమా కాథానాయకుడు తన కులంవాడు, తన బావమరిది, తన పార్టీ ప్రజా ప్రతినిధి, సినిమా తన ప్రాంతానికి చెందినదని అధినేత భావిచినట్లైతే, అసలు ఆ "అమరావతి" ని "ఉత్తర భారత అమరావతి" అని అర్ధం చేసు కోకపోవటం ఆయన అఙ్జానికి నిదర్శనం. 


మన చరిత్ర ఎంతో కొంత చెప్పిన "రుద్రమదేవి" కి ఆ ఏర్పాటును ఇవ్వకపోవటం అత్యంత దుర్దృష్టకరం. ఆ దర్శక నిర్మాత వేడుకున్నా ప్రజల ఆమోదం ఉన్నా "నేను నావాళ్ళు అన్న దృక్పథం" దాన్ని అధిగమించటమే అనర్ధానికి కారణం. కాకతీయ చరిత్ర తెలుగువాళ్లదే కాని తెలంగాణా చరిత్ర అన్నభావనతో ఆంధ్రప్రదేశ్ ఆ ప్రయో జనాన్ని రుద్రమదేవికి అందించలేదని  అని ప్రజల్లో ఉవ్వెత్తున వ్యతిరేఖత ప్రబలినా కూడ ఆ అధినేతకు స్వప్రయోజనాలే ప్రధానం. 


ఏడు ఆటల ప్రదర్శనకు అనుమతి నిచ్చిన "అఙ్జాతవాసి" సినిమాను 2000 నుంది 3000 థియేటర్స్ లో తొలివారంలోనే 50 షో లను నడిపించి "ఒక పిచ్చి కాపీ సినిమా" ని ప్రేక్షకుల నెత్తిన సినీ వ్యాపారులు రుద్దుతుంటే, దానికి సహకరించిన ముఖ్య మంత్రి క్షమార్హులు కానే కాదు. ఏ నిర్మాత దర్శకుడెవరనా సినిమా విడుదల రోజున్నే పెట్టిన పెట్టుబడి లాభాలతో తిరిగి రావా లని అత్యంత ఎక్కువ సంఖ్య థియేటర్స్ లో రిలీజ్ చేశారంటే ఆ సినిమా ఒక చెత్త సినిమా అని చెప్పొచ్చు. (దీనికి బాహుబలి ఎక్జెంప్షణ్)


ఒక వారం పాటు పండగ రోజుల్లో విడుదలైన  అధినేత బామ్మర్ధి సినిమా, మరో మిత్రుని సినిమా రెండూ వినొదం కోసం సినిమా చూట్టానికి వెళ్ళిన ప్రేక్షకులకు వినోదం కాస్తా విలాపన గా మారుతుంటే, జనాలకు మతులు పోగొడుతుంటే - ఆ రాష్ట్ర అధినేత వ్యాపార ప్రయోజనం నాకు ముఖ్యం నావాళ్ల ప్రయోజనం నాకు ముఖ్యమనే తీరు ప్రజా పాలనకు ఎంతవరకు అర్హత ఉందో? హర్షనీయమో ఆయనే ఆలోచించుకోవాలి. చిన్న చిన్న విషయాల్లోకూడా తమ బుద్ది బయట పెట్టుకునే కక్కుర్తి అయనకు అప కీర్తి తీసుకురాదా?  సమర్ధవంతమైన ప్రతిపక్షం లేకపోవటమే ఆయన అదృష్టం. ఇక ఆయనే ఆలోచించుకోవాలి. 


ఆ కథానాకుల్లో ఒకరు ఇప్పటికే ప్రజా ప్రతినిధి. ఆయన సినిమాలన్నీ ఒక మూసలో సాగే భీకర, భయానక, బీభత్స రసాత్మకాలే — అరుపులు, కేకలు, ఆందళనలతో వెర్రెత్తి పోయే సినిమాలే.  మరొ కథానాయకుని సినిమాలు తిక్క, వీరత్వం, ఇజం అంటూ తీసే సినిమాలే. ఇందులో ప్రజా వికాసాన్ని,  వినోదాన్ని, సందేశాన్ని  ఆశించటానికి ఏమీ ఉండదు. ఆయనకు ఆయన పార్టీకి ప్రజలు దురభిమానులు తప్ప వేరే వాళ్ళు ఓట్లు వేస్తారనే గ్యారంటీ లేదు. ఆయన తన జీవితం ద్వారా గాని, వ్యవహారం ద్వారా గాని ప్రజల కిచ్చే సందేశమూ ఏమీలేదు.

ఇలాంటి వాళ్ళకు సంఘ వ్యతిరెఖ శక్తులకు పెద్ద తేడా ఏమీ ఉండదు. వరస వెంట మూడు నాలుగు సినిమాలతో మునిగి పోయిన డిస్ట్రిబ్యూటర్లు ఆర్ధికంగా తేరుకోవటం కష్టమే. వీరి సినిమా నిర్మాణంలో దర్శక, కథానాయకుల రెమ్యూనరేషనే 50 నుంచి 60 శాతం ఉంటుందని సమాచారం. ఇదీ ఒకరకమైన సామాజిక ఆర్ధిక దోపిడీనే. నిండా మునిగేది నిర్మాతే. వీళ్ళు సినిమాకు 30 కోట్లు తీసుకొని సినిమాలో నటించి తిరిగి ఇచ్చే ప్రతిఫలం ఏమిటి?  ఈయన రాజకీయాల్లోకి వచ్చినా ఈ వ్యక్తిత్వం గలవాడు ప్రజలకు ఏమి చేయగలడు?    


నంది అవార్డుల ప్రధానం కాదు పంపకంగా మారిన సందర్భం లోనూ పక్షపాతం చూపిన పాలనను ఎవరైనా ఎందుకు గౌర విస్తారు? ప్రజల చేత ప్రజలకొరకు తో ప్రజల కోసం ఏర్పడ్దదన్న అర్ధాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వం "ఓట్లు కొని ప్రజల చేత, తనవారి కోసం, తనవారే పరమార్ధంగా నడిపే ప్రభుత్వం' అని చెప్పాలి. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే  ఆయన అందించ బోయే  "ప్రభుత్వం-పాలన వాటి రంగు, రుచి, వాసన" ప్రజలకు అర్ధమయ్యే ఉంటుంది. 


ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్కాం అయితే పవన్ కళ్యాణ్ లేదంటే బాలక్రిష్ణ,  మీరు ఏ చెత్త సినిమా తీసినా మేం ప్రభుత్వం ద్వారా సహకరిస్థాం అనే తీరు రేపు అశాంతికి మార్గం వేయోచ్చు. ఇందులో మాత్రం "తెలంగాణా ప్రభుత్వం విఙ్జత" ను అభి నందించక తప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: