గుట్టలాంటి పొట్టను లవంగంతో ఈజీగా కరిగించవచ్చనీ మీకు తెలుసా..?
సాధారణంగా లవంగాలను మసాలా దినుసులతో తయారుచేసే ఆహార పదార్థాలలో మాత్రమే వాడుతూ ఉంటాము.కానీ రోజుకు రెండు లవంగాలను కషాయం రూపంలో కానీ,పొడి చేసి స్మూతీలపైన,సలాడ్లపై చల్లి తీసుకోవడం వల్ల,పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతూ వస్తుంది.ఎందుకంటే..
లవంగాల్లో యాంటీఆక్సిడెంట్స్,యాంటీ ఒబెసిటీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్,ఫెనోలిక్,విటమిన్ C లు కూడా విరివిగా దొరుకుతాయి.వీటిని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడంతో,మన శరీరంలో ఉన్న వ్యర్థాలను,చెడు కొవ్వులను ఈజీగా తొలగిస్తాయి.దీనితో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా,ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
అంతేకాక మన పొట్ట లోపల ఆరోగ్యంగా ఉందో లేదో మనం తెలుసుకోలేము.అందువల్ల లవంగాల వంటివి రోజుకు రెండు చొప్పున తీసుకోవడంతో,అవి పొట్టలోపల అంతా క్లీన్ చేస్తాయి.జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.మరియు గ్యాస్,పొట్ట ఉబ్బరం,అజీర్తి వంటి సమస్యలను ఈజీగా తొలగిస్తాయి.వీటితో పాటు జీర్ణరసాలను సరైన క్రమంలో ఊరేలా ప్రేరేపిస్తాయి. పొట్టకు లవంగాలు అన్ని రకాలుగా మేలు కలగచేస్తాయి.
వీటితోపాటు ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి,ఎటువంటి రోగాలు రాకుండా అడ్డుకుంటాయి.మరియు ఇందులో ఉన్న అతి ముఖ్యమైన యువజనాల్ తైలం పంటి నొప్పి,శరీర వేడిమి,ఇన్ఫ్లమేషన్,మధుమేహం,అధిక బీపీ గుండెపోటు వంటి సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి.
కావున మీరు కూడా రోజుకు రెండు లవంగాలను ఏదొక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకోండి.