అబ్బ.. అలాంటి అవార్డులిస్తే తెలుగు మీడియాదే టాప్ ప్లేసేమో..!!

Vasishta

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా వెరైటీనే.! ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడడం ఆయన నైజం. ఆయన ఎన్నికే ఓ వెరైటీ. వైట్ హౌస్ లోకి వెళ్లాకనైనా ఆయన పనితీరులో మార్పు వస్తుందని అందరూ భావించారు. అయినా ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. తన దారి రహదారి అంటూ సాగిపోతున్నారు.


గతంలో పలుమార్లు మీడియాపై నోరు పారేసుకున్న ట్రంప్.. తాజాగా అవార్డులివ్వబోతున్నట్టు ప్రకటించారు. అయితే అవి పర్ఫార్మెన్స్ అవార్డులు కావు.. అత్యంత చెత్త మీడియా అవార్డులట.! నిజాయితీలేని, అవినీతి మీడియా అవార్డులను ఇస్తానని చెప్పారు. ఇప్పటికే పలు మీడియా సంస్థలపై ఆయన గుర్రుగా ఉంటున్నారు.


ప్రపంచ ప్రసిద్ధి చెందిన సీఎన్ఎన్, ఏబీసీ, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటివి ఫేక్ మీడియాగా పలుమార్లు సంబోధించారు ట్రంప్. ఒక్క ఫాక్స్ న్యూస్ ను మాత్రమే ఆయన ఇప్పటివరకూ ఏమీ అనలేదు. సోమవారం సాయంత్రం 5 గంటలకు అవినీతి మీడియా అవార్డులు ఇవ్వనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఫేక్ న్యూస్ మీడియాలో వివిధ విభాగాల్లో నిజాయితీ లేనివారికి అవార్డులు ఇస్తామని చెప్పారు. ఫాక్స్ న్యూస్ తప్ప ఫేక్ న్యూస్ ట్రోఫీ కోసం మిగిలిన సంస్థలు పోటీ పడుతున్నట్టు ఆయన గత నవంబర్ లోనే ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఫేక్ న్యూస్ ట్రోఫీకి అప్లై చేసుకోవాలంటూ గతంలో ట్రంప్ టీం ఆఫర్ చేసింది.


ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు సరికొత్త సంప్రదాయానికి తెరదీస్తున్నారు. గతంలో ఏ అధ్యక్షుడూ మీడియాపై ఈ స్థాయిలో కక్ష గట్టలేదు. ట్రంప్ మాత్రం సమయం వచ్చినప్పుడల్లా మీడియాపై విరుచుకుపడుతున్నారు. మీడియా కూడా ట్రంప్ ను అంతేస్థాయిలో ఎదుర్కొంటోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలను పలుమార్లు మీడియా తప్పుబట్టింది. మరిప్పుడు ఏకంగా ఫేక్ మీడియా అవార్డులు ఇస్తుండడంతో మీడియా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: