గవర్నర్‌ గారు, నేను స్నానం చేస్తుండగా బాత్‌-రూమ్‌లోకి తొంగి చూశారు: ఒక మహిళ పిర్యాదు

రాజకీయాలు చివరకు మరుగుదొడ్డి సందుల్లోకి కూడా దూరిపోతున్నాయి. తమిళనాడులో సందుదొరికితే రాజకీయ పార్టీలు చేయరాని అరాచకాలు చేస్తున్నాయి. ఎందులో నైనా నిజమెంత? అనేది ప్రశ్నార్ధకమౌతుంది. తమిళనాడు రాజకీయాల గురించి చర్చించి పెద్దగా ప్రయోజనం ఉండదని గతం లోనే అనేక సందర్భాల్లో ఋజువైంది. 


"నేను స్నానం చేస్తుండగా రాష్ట్ర గవర్నర్‌ నా బాత్‌-రూమ్‌ లోకి తొంగి చూశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోండి" అంటూ ఒక మహిళ పోలీసు స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒక సంచలనమైంది. "ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్‌కు గురిచేసింది" అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 


ప్రజల ముంగిట్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుందామనే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ నేడు (శుక్రవారం) కడలూరు జిల్లా లో పర్యటించారు. అధికారుల తో సమీక్షా సమావేశాల తరవాత కొందరి గృహాలను సందర్సించి పరిస్థితులను అర్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక ఇంటి లోకి వెళుతూ, పక్క నున్న మరుగు దొడ్డి లోకి తొంగిచూశారని ఆ సమయములో ఒక మహిళ స్నానం చేస్తుండటంతో గమనించి తక్షణమే వెనుకడుగువేశారు.


గవర్నర్‌ చర్యకు షాక్‌ తిన్న ఆ మహిళ కాసేపటికి పోలీస్‌-స్టేషన్‌ కు వెళ్లి తన పరువుకు భంగం కలిగించిన గవర్నర్‌పై తక్షణ మే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో గవర్నర్‌ వెంట కడలూరు కలెక్టర్‌, అధికార ఏఐడీఎంకే కి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారు. మరోవైపు గవర్నర్‌ పర్యటనను నిరసిస్తూ "ప్రతిపక్ష డీఎంకే" కడలూరు జిల్లా లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది. మహిళ ఫిర్యాదు పై గవర్నర్‌ గానీ, రాజ్‌భవన్‌ గానీ ఇంకా స్పందిం చాల్సిఉంది. ఇంత లోనే, కడలూరు-చెన్నై మార్గంలో గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ భద్రతా సిబ్బంది ప్రయాణించే వాహనం ఢీ-కొని ఇద్దరు మృతిచెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: