గుజరాత్‌ రెండో దశ పోలింగ్ ప్రారంభం..!

siri Madhukar
కాంగ్రెస్, భాజపాలకు అత్యంత కీలకమైన, చాలా ప్రతిష్టాత్మకంగా మారిన గుజరాత్ శాసనసభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మొదటిదశ పోలింగ్ లో మొత్తం 89 స్థానాలకు 977 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలలో ఎంతమంది పోటీ చేస్తున్నా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, భాజపాల మద్యే ఉండబోతోందని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఇవి ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల మద్య జరుగుతున్న పోటీగా చెప్పవచ్చు. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ పర్వం గురువారం ప్రారంభమైంది.

రాష్ట్రంలోని 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్ల సందడి కనిపించింది. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 93 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 2.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ (మెహ్‌సానా), అల్పేశ్‌ ఠాకూర్‌ (కాంగ్రెస్‌), జిగ్నేశ్‌ మేవానీ (వడగావ్‌), సురేశ్‌ పటేల్‌ (మణినగర్‌) వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, సాయంత్రం ఐదు గంటలనుంచి ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. గుజరాత్‌తోపాటు, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలపై వివిధ సర్వేసంస్థలు–మీడియా గ్రూపులు తాము చేసిన ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించనున్నాయి.  కాంగ్రెస్ పార్టీ 91 స్థానాల్లో పోటీ చేస్తోంది. 851 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. సాయుధ పోలీసుల పహరా మధ్య 14 జిల్లాల్లో తుది, రెండోదశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: