రామాయణం నిజం-వారది నిర్మాణం నిజం-డిస్కవరీ చానల్ నిర్దారణ

రామాయణ మహాభారతాలు హిందూ పురాణ గ్రంధాలే కాదు సాంస్కృతిక చరిత్రకు చిహ్నాలుగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువుల మనోభావాలను సహస్రాబ్ధాలు గా ప్రేరణ కలిగిస్తున్న ఈ పురాణాలు పుక్కిట గాధలు మాత్రం కావని భువిపై వెలిసి న యధార్ధాలని చెప్పే సంబంధించిన అత్యంత కీలకమైన వార్త ఇప్పుడు బుల్లి తెర మీదకు వచ్చింది. రామ‌సేతు ప్ర‌కృతి స‌హ‌జంగా ఏర్ప‌డింది కాద‌ని, అది కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రితం నిర్మిత‌మైంద‌ని ఆ చాన‌ల్ పేర్కొంది. త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రం నుంచి శ్రీలంక‌లోని మ‌న్నార్ ప్రాంతం వ‌ర‌కు వార‌ధి ఉన్న విష‌యంతెలిసిందే. అయితే ఈ వార‌ధి నిర్మాణాన్ని ఒకప్పుడు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధితో స‌హా ఎంతోమంది హేళన చేశారు.


 
పురాణాల్లోనే అత్యున్నత గౌరవ స్థానంలో ఉన్న రామాయణం లోని కీలక ఘట్టం పై ప్రచారంలో ఉన్న ఒక ప్రశస్తమైన అంశం నిజమైనదేనని తేలింది. సాక్షాత్తు అమెరికన్ డిస్కవరీ చానల్ గ్రూప్ కు చెందిన "సైన్స్ చానల్" ఈ విషయాన్ని ప్రకటించింది. ఇదంతా భారత్-శ్రీలంకలను కలుపుతూ, రామాయణ కాలం లో నాటి నరులు వానరులతో కలసి వారధి నిర్మించారని జరుగు తున్న వాదనలో ఎందరో విబేధించే వారున్నప్పటికీ, తాజాగా తాము పరిశోధించి మరీ చెప్తున్నామని అమెరికా సైన్స్ ఛానల్ వెల్లడించడం గమనార్హం.


Space images taken by NASA reveal a mysterious ancient bridge in the Palk Strait between India and Sri Lanka.

The bridge's unique curvature and composition by age reveals that it is man-made. Legend as well as Archeological studies reveal that the first signs of human inhabitants in Sri Lanka date back to the primitive age, about 1,750,000 years ago and the bridge's age is also almost equivalent.  ఈ రామసేతు 1750000 సంవత్సరాల క్రితం నిర్మించబడినదని పురాతత్వ శాత్రవెత్తల భావనతో నాసా పరిశోధన నిరూపించింది. 


పురాణాల విషయంలో ముఖ్యంగా రామాయణం విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రామాయణం పుక్కిట పురాణం అంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తుంటారు. అయితే  "డిస్కవరీ కమ్యూనికేషన్ నెత్ వర్క్ కు చెందిన సైన్స్ ఛానల్" ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. రామాయణం నిజంగానే జరిగిందని - రామసేతు మానవ నిర్మిత కట్టడమే నని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన సంపూర్ణ వివరణాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. 


తమిళనాడు లోని దక్షిణ తూర్పు (ఆగ్నేయ) ప్రాంతంలోనున్న రామేశ్వరం నుంచి, శ్రీలంకలోని (పశ్చిమోట్టర (వాయువ్య) ప్రాంతంలోని మన్నార్ ప్రాంతం వరకూ ఈ వారధిని నిర్మించారని అమెరికా సైన్స్ చానల్ తన కథనంలో పేర్కొంది. పూర్తిగా సున్నపురాయి (లైమ్ స్టోన్) తో నిర్మించిన ఈ వారధి లో ఉపయోగించిన రాళ్లు, నీటి మీద తేలుతూ, ఇసుక బలంతో కలసి పోయి ధృఢంగా శక్తివంతంగా నిలిచాయని వెల్లడించింది. రామేశ్వ‌రానికి చాలా దూరం నుంచి ఈ సున్న‌పురాళ్ల‌ను తీసుకొచ్చి స‌ముద్రంపై వంతెన నిర్మించారని తెలిపింది. నీటి మీద తేలే ఈ రాళ్ల‌కు ఇసుకను క‌లిపి చాలా దృఢంగా ఈ సేతువును నిర్మించార‌ని పేర్కొంది. ఈ సేతువు గురించి తెలుసుకునేందుకు భార‌త్‌, శ్రీలంక మ‌ధ్య‌లో ఉన్న వంతెన‌పై శాస్త్ర‌వేత్త‌లు 30 మైళ్ల వ‌ర‌కు పరిశోధ‌న‌లు సాగించారు. ఈ ప‌రిశోధ‌న‌ల ఫ‌లితంగానే ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని స‌ద‌రు చానెల్ పేర్కొంది.



భారత్ - శ్రీలంక మధ్య నున్న అంతర్జాతీయజలాల్లో ఉన్న "రామసేతువు" విషయంలో వాస్తవాలు వెలికి తీసేందుకు దాదాపు 30మైళ్ల దూరం‍ వరకూ భౌగోళిక శాస్త్రవెత్తలు  పరిశోధనలు నిర్వహించారు. ఆ తరవాతనే సైన్స్-చానల్ కోసం చేసిన పరిశోధ నలో రామ సేతువు నిజమని తెలపటం టెలికాష్ట్ కూడా చేయటం గమనార్హం.అయితే రామాయణం నిజంగానే జ‌రిగిం ద‌ని, దాదాపు ఏడువేళ్ల ఏళ్లక్రితం ఈ వార‌ధినిర్మాణం జ‌రిగింద‌ని డిస్క‌వ‌రీ నెట‌వ‌ర్క్‌కు చెందిన సైన్స్ చాన‌ల్ ధ్రువీక‌రించింది.

 
హిందూ మత విశ్వాసాల పరంగా బలమైన భావనలతో మాత్రమే చర్చల్లో ఉన్న రామసేతువు తాజాగా అమెరికా సైన్స్-చానల్ పరిశోధనతో శాస్త్రీయతతో దృవపడటం కూడా ఆధ్యాత్మిక వాదుల్లో సంతోషం వెల్లివిరియటానికి కారనమౌతుంది. ఇకనైనా కుహానా లౌకిక హేతువాదుల పేరుతో విమర్శలు చేయటం మానుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: