అమ్మాయిలను చూడగానే రిమ్మ తెగులు - కంపులో ట్రంప్

ఈ మద్య స్త్రీలపై లైంగివ వేదింపుల పరంపర విశ్వవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆఫీసుల్లో ఆఫీస్ బాయ్స్ నుండి కంపనీ సిఈఓ ల వరకేకాదు, గల్లీ లేదర్ నుండి డిల్లీ లీడర్ వరకు, హాలీవుడ్ వయా బాలీవుద్ టు టాలీవుడ్ కూడా ఈ మురికి గుంటలో పడటమేకాదు, ఏయిర్ క్రాఫ్టులో ప్రక్కన కూర్చున్న ప్రయాణికుణ్ణుంచి అమెరికాలో ప్రెసిడెంట్ వరకు ఎవరూ ఈ పాపానికి అతీతులు కాకుండా పోతున్నారు.   


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేనికీ అతీతుడుకాదు. ఈ మహానుబావుడు మరోమారు ఇరకాటంలోపడే పరిస్థితి ఎదురైంది. ఆయన తమతో అసభ్యంగా ప్రవర్తించారని, తమను లైంగిక వేదింపులకు గురిచేశారని గతంలో ముగ్గురు మహిళ లు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ముగ్గురూ మీడియా ముందుకు వచ్చారు. తాము గతంలో  డొనాల్డ్ ట్రంప్ పై చేసిన ఆరోపణలపై అమెరికా చట్ట సభలు ఎందుకు విచారణ చేపట్టలేదని? వాళ్లు డిమాండ్ చేశారు.


రేచల్ క్రూక్స్ -  జెస్సికా లీడ్స్ -  సమంతా హోల్వే లు పత్రికా సమావేశం నిర్వహించి డిమాండ్ లను వారికి వెల్లడించారు. రాజకీయాలను పార్టీలను పార్టీలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ డొనాల్డ్ ట్రంప్ అనైతిక ప్రవర్తనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆ ముగ్గురు మహిళలు కాంగ్రెస్ వేడుకున్నారు. చట్ట సభల మౌనం మన దేశానికే అవమానమని హెచ్చరించారు.



మహిళల పట్ల ట్రంప్ ప్రవర్తన సరిగా లేదని గతంలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఆరోపణలు చేశారు. ట్రంప్ గారి లైంగిక ఆరోపణలపై విచారణ చేపట్టాలని సుమారు 60 మంది అమెరికన్ కాంగ్రెస్ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. ఇటీవల ఒక హాలీవుడ్ నిర్మాత హీరోయిన్ ను లైంగికంగా వేధించారన్న ఘటన తర్వాత అమెరికాలో "మీ టూ క్యాంపేన్" జోరుగా కొనసాగుతోంది. 



తామత తంపరగా జరుగుతున్న వేధింపులను మహిళలు ఇప్పుడు బహిరంగంగా నిర్భయంగా వెలిబుచ్చుతూ "మీ-టూ"ట్విట్టర్ ప్రచారంలో విరివిగా పాల్గొంటున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటి వరకు సమాజం స్పందన ఎలా వుంటుందో అనే భయంతో దాచుకున్న తాము  పడ్డ లైంగిక అవస్థలను చెప్పుకుంటున్న మహిళలకు రక్షణ ఇవ్వాలని డెమోక్రటిక్ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. 

ఈ నేపథ్యంలో వాళ్లు "హౌజ్ కమిటీ" కి ఒక లేఖ కూడా రాశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల అంశంలోనూ విచారణ చేపట్టాలని అమెరికా ఉభయసభలను మహిళా నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రెసిడెంట్ పట్ల మహిళలు చేసిన ఆరోపణలను వైట్హౌజ్ ఖండించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: