భారత పరపతి మన్మోహన్ కన్నా మోడీనే బాగా పెంచారు: ఫేస్-బుక్ పోల్

మన్మోహన్ వస్తువులపై పెన్ను వేసి తగ్గించటం విమర్శించారు. అది ఒక ఆర్ధికవేత్త చెప్ప తగినది కాదు. ఒక రాజకీయవేత్త చెప్పినట్లు చెప్పారు. ఒక నూతన ఆర్ధిక విధానం సృష్టించేటప్పుడు కొన్ని మార్పులు సవరణలు తప్పవు. మూడీస్ అనే రేటింగ్ ఏజెన్సీది సాధారణ విశ్లేషణకాదు. అంతర్జాతీయంగా దేశాలమధ్య ఋణబంధాలు ఈ రేటింగ్స్ మీదే బలంగా అధారపడతాయి అటల్ బిహారీ వాజపేయీ పీరియడ్ లో పెరిగిన రేటింగ్ మళ్ళా నమో పీరియడ్ లోనే పెరిగింది. కారణం నరెంద్ర మోడీ తీసు కున్న నిర్ణయాలే.


విశ్వవ్యాప్తంగా భారత్ ఆర్ధికంగా గౌరవం లేదా పరపతి లేదా సార్వబౌమ రేటింగ్ వాజపేయీ నుండి మోడీ మద్యకాలంలో చాలా నీరసంగా ఉన్నట్లే. కొన్ని సందర్భాల్లో భారత్ తన సార్వభౌమత్వాన్నిరిస్కుకు గురిచేసిందన్నట్లే. మన్మోహన్ ఒక ఆర్ధిక  మేధావి అనటంలో సందేహం లేదు. కాని పరిపాలనాధికారాలు ఆయన్ని ధిక్కరించి ఉండవచ్చు. గతంలో పి.వి. నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్ధిక శాఖామంత్రిగా ఉన్న మన్మోహన్ పై ఈగ కూడా వాలనివ్వకుండా కంచుకోటలా అడ్దు గా ఉన్నారు. అందుకే ఆయన ప్రవచించే సరళీకృత ఆర్ధిక విధానాలు అమలు చేయ గలిగారు. తరవాత ఆయన ప్రధానిగా ఉన్నా ఆయన ఆ సామర్ధ్యాన్ని ప్రదర్శించలేక పోయారు. దానికి రాజకీయ అవసరాలే కారణం.



జిఎస్టి కి ఇంకొంతకాలం సవరణలుతప్పవు. కారణం "జిఎస్టి స్థిరీకరణ"జరగాలి ఇంకా. డిమోనిటైజేషన్ నిజంగా ముందు ముందు  సత్ఫలితాలివ్వవచ్చు. ప్రస్తుతానికి దానివల్ల మనం పడ్డ వేదనే మనను భాదిస్తుంది. కొన్నాళ్ళకు గాని దాని ఫలితాలు బయటపడతాయి. అలాగే లోపాలు మాత్రమే మనం చూశామిప్పుడు లాభాలు చూడాలిక. పన్ను పరిదిలోకి అనేక వ్యక్తిగత వ్యవస్థలు వచ్చి చేరాయి. ఇంకా విశ్లేషణలు జరుగుతున్నాయి. సాంఘిక సంక్షేమ ఫలాలు అన్యాయంగా భోంచేసే బకాసురుల పై చర్యలకు ఉపక్రమించే అవకాసాలున్నాయి. 



భారతదేశ ఆర్థికవ్యవస్థ నిర్వహణ మాజీ ప్రధాని మన్మోహన్‌ కంటే ప్రస్తుత ప్రధాని నరెంద్ర మోదీ హయాం లోనే బాగుందని సోషల్‌ మీడియా పోల్‌ లో అత్యధిక శాతం అభిప్రాయ పడ్డారు. మూడీస్‌ సంస్థ శుక్రవారం భారతదేశ "సౌర్వభౌమ రేటింగ్‌" ను (రాజ్య పరపతి) పెంచిన నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్వీటర్‌ లో ఎకనామిక్ టైమ్స్‌ ఈ పోల్‌ నిర్వహించింది. ఫేస్‌బుక్‌ పోల్‌లో 69 శాతం మన్మోహన్‌ కంటే నరెంద్ర మోదీయే ఉత్తమమని చెప్పగా, 31 శాతం మంది మన్మోహన్‌కు అనుకూలంగా ఓటేశారు.


మొత్తం 3 లక్షల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు. ట్వీటర్‌ పోల్‌ లో 74 శాతం మోదీకి అనుకూలంగా, 20 శాతం మన్మోహన్‌కు అనుకూలంగా నిలిచారు. ట్వీటర్‌ పోల్‌లో 3500 మంది పాల్గొన్నారు.  అమెరికాకు చెందిన రేటింగ్‌ సంస్థ మూడీస్‌ భారత సౌర్వ భౌమ రేటింగ్‌ను పెంచినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలం నుంచి ఇంకా బయట పడలేదని మన్మోహన్‌ అన్నారు. కొచ్చి లోని ఒక  కళాశాలలో శనివారం ఆయన మాట్లాడుతూ రేటింగ్‌ పెరగడం మంచిదేననీ, అయితే అంతమాత్రానికే ఆర్థిక వ్యవస్థ అంతా సవ్యంగా ఉన్నట్లు పొరబడకూడదని అన్నారు. నోట్టరద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ గమనం మందకొడిగా తయారైందన్నారు. సరైన కసరత్తు లేకుండా జీఎస్టీ తెచ్చారని, 211 రకాల వస్తువులపై అధిక పన్ను వేసి తర్వాత తగ్గించాల్సి వచ్చిందన్నారు.


ఎంతటి సమర్ధులున్నా ధీటైన నాయకత్వం చాలాఅవసరం. దాన్ని మోడీ యివ్వగలుగుతున్నారు. మౌనంగానే రాజనీతిని ప్రదర్శిస్తున్నారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల తో కలిపి చాలా రాష్ట్రాల్లో లక్షల కోట్లు దుబారా అవినీతి తో గాయబ్ అవుతు న్నా కేంద్ర స్థాయిలో సార్వభౌమ రేటింగ్ భారత్ ఆర్ధిక సుస్థిరతను తెలియ జేస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: