క్రియాశీలక రాజకీయాల్లోకి విజయశాంతి..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో తన అందచందాలతో అగ్ర హీరోల సరసన నటించిన లేడీ అబితాబ్ పేరు తెచ్చుకుంది విజయశాంతి.  తర్వాత రాజకీయాల్లోకి అడుపెట్టిన విజయశాంతి ‘తల్లి తెలంగాణ ’ పేరిట పార్టీ పెట్టి తర్వాత టీఆర్ఎస్ లో విలీనం చేసి కొంత కాలం టీఆర్ఎస్ లో పనిచేశారు.  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో పార్టీలోంచి బయటకు వచ్చిన విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  విజయశాంతి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారు.

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చురుకుగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు.  ఈ మేరకు  ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో విజ‌య‌శాంతి భేటీ అయిన సంగతి విదితమే. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. నేను ఏ పదవీ ఆశించిన కాంగ్రెస్ లోకి రావడంలేదని ఓ సామాన్య కార్యకర్తగా వ్యవహరిస్తానని రాహుల్‌తో విజ‌య‌శాంతి చెప్పారు.   విజయశాంతి రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక గత ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయశాంతి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవందర్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: