కమల్ కి చెన్నై హైకోర్టు షాక్ ..!

veeru
తమిళనాడులో ఈ మద్య రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఓ సినిమా మరిన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది.  విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం అద్భుతమైన విజయం సాధించి విపరీతమై కలెక్షన్లు సాధిస్తుంది. మరోవైపు అదే రేంజ్ లో వివాదాలు చుట్టుముడుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సపోర్ట్ చేసి మాట్లాడిన విశ్వనటుడు కమల్ హాసన్ కి చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. 

తమిళనాడు రాజకీయాలు బ్రస్టు పట్టిపోయాయని త్వరలో తాను కొత్త పార్టీ పెట్టి రాజకీయ  ప్రక్షాళన చేస్తానని ఆ మద్య స్టేట్ మెంట్ ఇచ్చారు కమల్ హాసన్.  వాస్తవానికి కొద్ది రోజులుగా రాజకీయ వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  మెర్సిల్ చిత్రంలో జీఎస్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా డైలాగ్స్ ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

డెంగ్యూ నివారణకు ప్రభుత్వం ఇస్తున్న నీలవేంబు అనే ఆయుర్వేద ఔషదం వినియోగంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కమల్ కామెంట్ చేయటంపై జీ దేవరాజన్ కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, కమల్ పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.ఇటీవల ప్రభుత్వం ఇచ్చే డెంగ్యూ మందుల విషయంలో కమల్ కామెంట్స్ పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: