ఏపీకి మోదీ చేసిన మరో మోసం ఏంటో తెలుసా..!?

Vasishta

“విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత మాది.. పైగా తెలుగుదేశం మాకు మిత్రపక్షం.. చంద్రబాబు మాకు నమ్మకమైన మిత్రుడు..” అని మోదీ పలుమార్లు చెప్పారు. కేంద్రం పెద్దలు కూడా ఇదే మాట వల్లెవేస్తుంటారు. అయితే మోదీ మరోసారి నమ్మించి మోసం చేశారు. అదేంటో తెలుసా..?


          రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి కేటాయించిన ప్రాజెక్టుల్లో మెరైన్ అకాడమీ ఒకటి. తీరప్రాంత గస్తీ దళానికి ట్రనింగ్ ఇవ్వడం మెరైన్ అకాడమీ ఉద్దేశం. విశాలమైన తీర ప్రాంతం కలిగిన దక్షిణ భారతదేశంలో మెరైన్ అకాడమీ లేదు. ముంబై ఎటాక్స్ తర్వాత తీరప్రాంతాల్లో గస్తీ పెంచారు. అయితే మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం దక్షిణాదిన ఓ మెరైన్ అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


          దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయదలిచిన మెరైన్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ప్రతిపాదించగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 300 ఎకరాలను వెంటనే కేటాయించింది. మెరైన్ ఐజీ శ్రీనివాసరెడ్డి కూడా స్థలాన్ని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలో వచ్చిన టీం కూడా మెరైన్ అకాడమీకి ఇదే అత్యంత అనువైన స్థలమని ప్రకటించింది.


          మెరైన్ అకాడమీని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు, గుజరాత్ కూడా పోటీపడ్డాయి. అయితే విభజనతో సర్వస్వం కోల్పోయిన ఏపీకే మెరైన్ అకాడమీని కేటాయించాలంటూ సీఎం చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు గట్టిగా పట్టుబట్టడంతో రాష్ట్రానికే కేటాయిస్తున్నట్టు కేంద్రం కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ అకాడమీని గుజరాత్ కు తరలించినట్టు సమాచారం.


          త్వరలోనే గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకోసం గుజరాత్ కు వరాల వర్షం కురిపిస్తోంది. తాజాగా మెరైన్ అకాడమీ తరలింపు కూడా మోదీ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. మరోవైపు మన నేతలు కూడా ఫాలో అప్ చేయకపోవడంతో మెరైన్ అకాడమనీ మనకు దక్కకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి..మొత్తానికి మోదీ మరోసారి ఏపీకి అన్యాయం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: