ఉత్తర కొరియా చైనా తలకు మించిన భారం కానుందా..?

 చైనా తీరు 'ఇంట ఈగల మోత. బయట పల్లకీల మోతా లాగా ఉంది. ఐఖ్య రాజ్య సమితి - భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన చైనా తనకున్న వీటో పవర్ ఉపయోగించి అమెరిక, దక్షిన కొరియాల ఆగర్భ శత్రుదేశమైన ఉత్తర కొరియాను ఆంక్షల నుండి ఇప్పటివరకు కాపాడుతూ వస్తుంది అదీ రష్యా సహకారంతో. కమ్యూనిష్ట్ రాజ్యమైనా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం-జాంగ్-ఉన్ అనే నియంత పాలనలో అణుయుద్ధానికి తెరలేపి విశ్వ వినాశనానికి దారులు వేస్తుంది. అయితే ఇప్పుడు చైనా విచిత్రంగా ఉత్తర కొరియాకు భయపడుతుంది.



 

"ఉత్తర కొరియా" ఆ పేరు వింటేనే చైనా ప్రజలకు ఒళ్ళు జలధరిస్తుంది. ఇది వేరెవరో చెప్పిన విషయం కాదు స్వయానా చైనా అధికార ప్రతినిధి "టీషేం గువా" తెలిపారు.  తమ దేశానికి ఉత్తర కొరియా మంచి మిత్ర దేశమని ప్రపంచానికి తెలుసునని టీషేంగువా మరోసారి స్పష్టం చేశారు. కానీ, ఉత్తర కొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలు తమను కూడా అత్యంత కలవరానికి గురిచేస్తున్నాయని ఆయన అంటున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తర కొరియా ప్రయోగాత్మకంగా ప్రయోగించిన పరిశీలించిన "ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి"  ఉత్తర చైనా సరిహద్దులకు అత్యంత సమీపం నుండి దూసుకెళ్ళిందని తెలిపారు. ఎటువంటి ముందస్తు  హెచ్చరికలు, కనీసం తన మిత్రదేశానికి కనీస సమాచారం  కూడా తెలుపకుండానే, క్షిపణి ప్రయోగం చేపట్టి ఉత్తర కొరియా తమ ప్రజలను కూడా భయపెట్టాలని చూసిందని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


 

"తమ సహాయ సహకారాలతోనే పాలుపోసి పెంచిన పాములా తమ పొరుగుననే తన మిత్రుని రూపము లో అత్యంత ప్రమాదకర శత్రువు పెరుగుతున్నాడని"  అది 'ఇంతింతై వటుడింతై' లాగా  ఏదో ఒక రోజు తమపై  (చైనా) కూడా దాడి చేసేందుకు చూస్తున్నదని 'జూహో'  అనే స్థానికుడు కూడా మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బీజింగ్‌ కేంద్రంగా ఉత్తర కొరియా ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని, పరిస్థితులు తమ చేయి జారి పోవచ్చని 'జూహో' అభిప్రాయ పడుతున్నాడు.




కత్తి పట్టుకున్న "ఉన్మాది" ఎవరికైనా పొరుగు స్నేహితునికి కూడా ఉన్మాధం తో ప్రమాధంలోకి నెట్టి వారికి గాయం చేయకుండా ఊరుకోడని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియా కూడా అదే ఉన్మాదంలో ఉందన్నారు. అది మిత్ర దేశం పోరుగు దేశం చైనాకు కూడా అత్యంత ప్రమాదమేనని ఆయన తెలిపారు. అమెరికా మీడియా మాత్రం చైనా, ఉత్తర కొరియాలు కపట నాటకాలకు తెరతీశాయని అంటుంది. కాని మారెండు దేశాలు ఒకరినొకరు నమ్మే స్థితిలో లేరని, ప్రపంచం లో ఎవ్వరూ కూడా నమ్మలేరని అంటుంది. పాముకి పాలుపోసి పెంచితే అది పాలుపోసిన వాడని భావించి వదిలెయ్యడు. బహుశ అంతర్జాతీయంగా చైనా ఉత్తర కొరియా మైత్రితో వివాదాల్లో చిక్కునే పరిస్థితుల్లోకి నెట్టబడ్డా ఆశ్చర్యం లేదు. రష్యాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవవచ్చు.




అణ్వాయుధాలు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో అమెరికా హడలెత్తిస్తున్న కిం జాంగ్ ఉన్ అటు తన మిత్ర దేశం చైనాకు తన, ఇటు శత్రుదేశం దక్షిణ కొరియాకు, జపాంకు ఆ దేశాల ప్రజలకు కంటిమీద కునుకు రాకుండా నిరంతరం దుందుడుకు చర్యలకు ఉపక్రమించటం ప్రపంచానికే హాని జరిగే అవకాశాలు సుస్పస్ఠం. మరో ప్రపంచ సంగ్రామానికి ఈ ఉన్మాదే కారణమైనా ఆశ్చర్యం లేదు. దానికి మద్దతు పలికే చైనా రష్యాలే తొలిదెబ్బ తినే అవకాశం పుష్కలం. ఉత్తర కొరియా కు ఎదైనా జరిగితే దాంతో వ్యాపారం చేసే చైనాకు రష్యాలకు ఆర్ధిక నష్టం లెక్కకుమిక్కిలిగా ఉంటుంది.



China preparing for potential crisis with North Korea


అలాగే చైనా కు మరో ఉత్తర కొరియా లాంటి స్నేహితుడే పాకిస్థాన్ కూడా. ఉదాహరణకు కొన్ని దశాబ్ధాలుగా ఆర్ధిక సహకారం అందించిన ఇప్పటి వరకు కూడా అందిస్తున్న అమెరికాను "తూ నా బొడ్డు" అన్నంత తేలికగా అంతర్జాతీయంగా పలుచన చేస్తుంది పాకిస్థాన్.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: