వైకాపా జంపింగ్ ఎమ్మెల్యే ల న్యూస్ లో నిజమెంత...!

KSK

నంద్యాల ఉప ఎన్నికల తరవాత టీడీపీ లోకి వలసలు ఉంటాయి అనే వాదన తెరమీదకి వచ్చింది ఎప్పుడో. ప్రతిపక్ష పార్టీ కి చెందిన కొందరు ఎమ్మెల్యే లు సిద్దంగా ఉన్నారు అనీ , టీడీపీ నాయకత్వం ఓకే అంటే చాలు వారు కండువాలు మార్చడానికి సిద్దం అనీ మాటలు వినపడ్డాయి. నంద్యాల ఓటమి తరవాత జగన్ వైపు ఉండడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు అని వారు ఫీల్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి .. అయితే అలాంటి జంపింగ్ లు ఏవీ ఎక్కడా జరగలేదు.


కనీసం ప్రయత్నాలు కూడా జరిగినట్టు దాఖలాలు లేవు. కానీ టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు మళ్ళీ ఈ విషయం తెరమీదకి తీసుకుని వచ్చారు, శ్రీకాకుళం లో జరిగిన ఒక ప్రోగ్రాం లో ఆయన ఈ విషయం మాట్లాడారు. దాదాపు ఆరుగురు వైకాపా ఎమ్మెల్యే లు తమతో టచ్ లో ఉన్నారు అని ఆయన చెప్పడం విశేషం.


టీడీపీ లో చేరతాం అంటూ ఫోన్ ల మీద ఫోన్ లు వస్తున్నాయి అని ఆయన అన్నారు. వైకాపా నేత‌లు త‌న‌కు స్వ‌యంగా ఫోన్లు చేస్తున్నార‌నీ, ఇప్ప‌టివ‌ర‌కూ ఆరు ఫోన్ కాల్స్ వ‌చ్చాయ‌నీ, వారంతా వైకాపా వ‌దిలి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు త‌న‌తో చెప్పిన‌ట్టు మంత్రి అచ్చెన్న చెప్ప‌డం విశేషం! వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంద‌నీ, ఆ పార్టీలో ఎవ్వ‌రూ ఉండ‌లేర‌నే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అచ్చెన్న జోస్యం చెప్పారు.


ఫోన్ చేసిన నేతలు ఎవరో బయటపెట్టాలి అనే వైకాపా ఛాలెంజ్ చేసినా కూడా రిప్లయ్ లేదు మంత్రి గారి దగ్గర నుంచి. టీడీపీ లోకి ఎవరినైనా రప్పించాలి అంటే కొందరు మంత్రులతో , నాయకులతో బయటవాళ్ళు డీల్ మాట్లాడుకుంటారు అలా మాట్లాడే నాయకులలో అచ్చెన్నాయుడు కూడా ఒకరు అంటూ ఉంటారు. ప్రతిపక్షానికి త్వరలో భారీ కుదుపు వస్తుంది అనే ఫీలింగ్ క్రియేట్ చెయ్యడం కోసం ఇలా చెప్పరా లేక నిజంగానే ఫోన్ లు వస్తున్నాయా  ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: