ఇరాక్ పై ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..!

Edari Rama Krishna
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజు కీ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి.  టార్గెట్ ఏదైనా..అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  జిహాదీ పేరిట వారు చేస్తున్న నరమేదం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అఫ్ఘన్ దేశాల్లో ఉగ్రవాదులు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రెచ్చిపోతూ ఎంతో మంది ప్రాణాలు హరిస్తున్నారు.  తాజాగా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఇరాక్ పై మరోసారి పంజా విసిరింది.

 దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంటుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఆపై అక్కడికి దగ్గరలోనే ఉన్న చెక్ పోస్టుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ మారణకాండలో 74 మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో 95 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.  గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.  

అక్కడి భీతావాహన పరిస్థితి చూస్తుంటే ఎలాంటి వారికైనా గుండెలు తరుక్కుపోయేలా ఉన్నాయి.  చెల్లాచెదురైనా మృత దేహాలు..గాయాలతో రక్తమోడుతున్న క్షతగాత్రులు చేస్తున్న హహాకారాలు ఘటనా స్థలిలో పరిస్థితి దారుణంగా ఉంది.

కాగా, భద్రతా బలగాలతో కలసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షియా సంస్థ 'హషీద్ అల్ షాబి' సభ్యుల రూపంలో వచ్చిన ముష్కరులు ఈ దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు. కాగా, ఇస్లాంకు వ్యతిరేకంగా నడుస్తున్న ఇరాక్ పై ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: