భారత్ వద్ద ఉన్న ఆయుధ నిల్వలు చైనాతో పదిరోజుల యుద్ధానికి కూడా సరిపోవు: కాగ్


భారత్ మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి భారత్ వద్ద లేదని "కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)" తన ఆడిట్ రిపోర్టులో స్పష్ఠం గా పేర్కొంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓ.ఎఫ్.బి) కు సంబంధించిన వివరాలను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కాగ్.

 

దేశ రక్షణకు ఎంతో అవసరమైన యుద్ధ సామగ్రిని పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచుకోలేక పోతున్నామని చెప్పింది. 2013 నుంచి 2016 సెప్టెంబర్ వరకూ మన వద్ద ఉన్న యుద్ధ సామగ్రి నిల్వల్లో పెద్ద మార్పు లేవి లేవని తెలిపింది. ఇప్పటి కిప్పుడు యుద్ధం వస్తే అత్యవసరమయ్యే 55 శాతం సామగ్రి అందుబాటులో లేదని అందుబాటులో ఉన్న 40 శాతం యుద్ధ సామగ్రి కూడా పది రోజుల పాటు పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పూర్తి ఖర్చై పోతుందని తెలిపింది.


 

ముఖ్యంగా ఆర్టిలరీ గన్స్, యుద్ధ ట్యాంకులకు అవసరమయ్యే యుద్ధ సామగ్రి కొరత తీవ్రంగా ఉందని చెప్పింది. 2013లో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం లో ఓ.ఎఫ్.బి  విఫలమైందని విమర్శించింది. పేలుళ్లకు, మిస్సైళ్ళ లో ఉపయోగించే ఫ్యూజుల కొరత ఎక్కువగా ఉందని ఆర్టిలరీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది ఒక జాతీయ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వూ లో పేర్కొన్నారు. "ఫ్యూజ్లు లేకపోవడం వల్ల యుద్ధం లో మిస్సైల్స్, మోర్టార్స్, ఆర్టిలరీ ఎక్స్-ఫ్లోజివ్స్ అసలు వినియోగించే అవకాశమే లేదని చెప్పారు.

 

ఇదిలాఉండగా...యుద్ధం వస్తే మన ఆయుధాలు సరిపోవనే సంచలన వాస్తవం వెళ్లడయింది.ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండర్ ఆడిటర్ జనరల్ తన నివేదికలో పేర్కొంది. ``భారత ఆర్మీలో సరిపోను ఆయుధాలు లేవు. మన ఆర్మీ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి యుద్ధానికి సరిపోదట. ఒకవేళ యుద్ధం వస్తే మన ఆయుధాలు కేవలం 20 రోజుల్లోనే ఖాళీ అవుతాయి. అంటే మనం దీర్ఘకాలం యుద్ధం చేయలేం` అని కాగ్ నివేదిక విశ్లేషించింది. శుక్రవారం కాగ్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 


 


ఆగస్టు మొదటి వారాల్లో యుద్ధట్యాంకులు, శతఘ్నులకు అవసరమయ్యే మందుగుండు సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాలు ధ్రువీకరించినట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థ పేర్కొంది. వచ్చే ఏడాది చివరి నాటికి మరింత ఆయుధ సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో 40రోజుల పాటు యుద్ధం చేసేందుకు సరిపడా ఆయుధాలను నిల్వ ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సామాగ్రి అంతా పంపిణీకి ముందు తనిఖీ దశల్లో ఉందని, ఆ తర్వాత భారత్‌కు పంపిస్తారని సదరు మీడియా పేర్కొంది.

 

ప్రభుత్వ రంగ ఆయుధ కర్మాగార సంస్థ సైన్యానికి సరపడా మందుగుండు సామాగ్రి ఇవ్వడం లేదని కాగ్‌ నిన్న విమర్శించిన విషయం తెలిసిందే. 2013 నుంచి సైన్యంలో మందుగుండు సామాగ్రి కొరత ఉందని, అయినా ఎలాంటి మార్పు జరగడం లేదని కాగ్‌ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఆయుధ సామాగ్రితో 10 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేసే పరిస్థితి లేదని తెలిపింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: