నన్ను భయపెట్టిన ఒకే ఒక బ్యాట్స్మెన్ అతనే : గంభీర్

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. భారత జట్టు ధోని కెప్టెన్సీలో రెండు వరల్డ్ కప్ లు గెలిచింది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర వహించింది మాత్రం అటు గౌతం గంభీర్ అనే చెప్పాలి. ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ జట్టులో సభ్యుడుగా కొనసాగిన గంభీర్ తన వీరోచితమైన ఇన్నింగ్స్ లతో ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లలో భారత జట్టును విజయ తీరాల వైపుకు నడిపించాడు. ఈ క్రమంలోనే తన అద్భుతమైన అటు తీరుతో ఇక భారత జట్టు రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.

 అయితే క్రికెట్ తో గౌతమ్ గంభీర్ ఎలా అయితే గుర్తింపును సంపాదించుకున్నాడో.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా అంతే గుర్తింపును సంపాదించుకున్నాడు గంభీర్. ఎప్పుడూ తోటి క్రికెటర్ల పై సెలెక్టర్ల తీరుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేవాడు. అయితే ఇక ప్రత్యర్థి ఆటగాళ్లతో కూడా తరచు గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు అని చెప్పాలి. దీంతో గౌతమ్ గంభీర్ కి ధైర్యం ఎక్కువ అని అందరూ అనుకుంటూ ఉండేవారు. కానీ అలాంటి ధైర్యవంతుడు అయినా గంభీర్ ను సైతం ఒక ఆటగాడు ఎంతగానో భయపెట్టాడట.

 ఇలా గౌతమ్ గంభీర్  ని భయపెట్టిన ప్లేయర్ ఎవరో కాదు రోహిత్ శర్మ. ఐపీఎల్లోరోహిత్ శర్మ తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు  అంటూ గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఎబి డివిలియర్స్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ధోని లాంటి క్రికెటర్లతో ఆడినప్పటికీ ఇక హిట్ మ్యాన్ ఆపడం చాలా కష్టంగా ఉండేది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నన్ను భయపెట్టిన ఏకైక బ్యాట్స్మెన్ అతనే అంటూ తెలిపాడు. కోల్కతా కెప్టెన్గా ఉన్న సమయంలో రోహిత్ ని అవుట్ చేసేందుకు ఏకంగా మూడు ప్లాన్స్ వేసుకునే వాడిని. అయినప్పటికీ రోహిత్ ను కంట్రోల్ చేయడం సాధ్యం అయ్యేది కాదు అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు స్టార్ స్పోర్ట్స్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: