ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవికాలం ఎండల మండల కంటే రాజకీయ మంటలు ఎక్కువ అవుతున్నాయి. ఎలక్షన్ డే దగ్గర పడడంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అందులో భాగంగా అధికార పార్టీ , ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఇది వరకు గెలిచిన స్థానాలలో కొంతమందిని అలాగే ఉ

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవికాలం ఎండల మండల కంటే రాజకీయ మంటలు ఎక్కువ అవుతున్నాయి. ఎలక్షన్ డే దగ్గర పడడంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అందులో భాగంగా అధికార పార్టీ , ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఇది వరకు గెలిచిన స్థానాలలో కొంతమందిని అలాగే ఉంచిన చాలా వరకు మార్చేశారు. ఇక మరి కొంత మంది కి ఒక ఏరియాలో గట్టి పట్టు ఉన్నా కానీ ఆ ప్రాంతం సీటు కాకుండా వేరే ప్రాంతాల సీట్లు కూడా ఇచ్చారు. అలా గట్టి పట్టు ఉన్న ఏరియా సీటు నుండి మారిపోయిన వ్యక్తులలో వేల్లంపల్లి శ్రీనివాసరావు ఒకరు.

ఈయన 2009 లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత ఈయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ 2016 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు.

ఇలా శ్రీనివాసరావు 2009 వ సంవత్సరం నుండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీలోకి దిగుతూ వస్తున్నాడు. ఒకసారి ఓడిపోయినప్పటికి రెండు సార్లు ఈ ప్రాంతంలో గెలిచి ఇక్కడ తన గట్టి పట్టును నిరూపించుకున్నాడు. ఈ ఏరియాలో ఇతనికి ఇంత పట్టు ఉండగా మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో శ్రీనివాస్ కు విజయవాడ వెస్ట్ సీట్ కాకుండా విజయవాడ సెంట్రల్ సీట్ ను ఇచ్చారు. ఇక విజయవాడ సెంట్రల్ లో ఇప్పటికే పోయినసారి ఎలక్షన్లలో ఇక్కడి నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పనిలోకి దిగిన మల్లాది విష్ణు గెలుపొందారు.

ఇక ఆయనను కాదు అని చెప్పి జగన్ ఈ ప్రాంత సీటును శ్రీనివాసరావు కి ఇచ్చాడు. దానితో ఒక రకంగా చూసుకుంటే విష్ణు క్యాడర్ శ్రీనివాస్ కు సపోర్ట్ చేస్తుందా..? లేదా..? ఒక వేళ అధిష్టానం ఆజ్ఞ మేరకు చేసిన వారి పూర్తి సపోర్ట్ శ్రీనివాసరావు కి ఉంటుందా..? లేదా అనేది కాస్త ఆసక్తిగా మారింది. ఏదేమైనప్పటికీ తన కంచుకోట అయినటువంటి విజయవాడ వెస్ట్ నుండి సెంట్రల్ కు వచ్చిన వేల్లంపల్లి శ్రీనివాస్ రావుకు మరి ఈ సారి ఇక్కడ ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vsr

సంబంధిత వార్తలు: